'కూలీ' ట్రైలర్ లో ఒకటి తగ్గింది.. 'వార్2' దే పై చేయి?
ఈ నెల 14వ తేదీన వార్2, కూలీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హోరాహోరీగా తలపడబోతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో నేరుగా మొదటిసారి నటించిన చిత్రం వార్2. హృతిక్ రోషన్ తో కలిసి ఆయన నటించారు. కియారా అద్వానీ కథానాయిక. అయాన్ ముఖర్జీ దర్శకుడు. 2019లో బ్లాక్ బస్టర్ అయిన వార్ కు సీక్వెల్ గా వార్2 తీస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో ఇద్దరు హీరోలను బాగా ఎలివేట్ చేశారు దర్శకుడు. లార్జర్ దెన్ లైఫ్ ఈవెంట్ స్టయిల్‌లో ట్రైలర్ కట్ చేశారు. తారక్, హృతిక్ కలిసి ఒక యాక్షన్ విజువల్ ఫీస్ట్ అందించనున్నారనే విషయం స్పష్టంగా అభిమానులకు అర్థమైంది.
కథను చెప్పకుండా దాచిన దర్శకుడు
కూలీలో రజనీతోపాటు నాగార్జున, అమిర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్లు ఉన్నారు. నాగార్జున తొలిసారిగా విలన్ గా నటిచారు. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై తొలినుంచి మంచి క్రేజ్ ఉంది. అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ క్రేజ్ కొంచెం తగ్గింది. కూలీ ట్రైలర్ కు మిశ్రమ స్పందన దక్కింది. లోకేష్ కనగరాజ్ ట్రైలర్ లో అన్నీ చెప్పకుండా చాలా విషయాలు దాచేశాడు. ఎవరెవరు ఏ తరహా పాత్రలు పోషించారు? ఆ పాత్రలు ఏం చేస్తాయి? అనే విషయాలు తెలియదు. కథ జోలికి కూడా వెళ్లలేదు. లోకేష్ ఎలాంటి కథను చెప్పబోతున్నాడనే విషయాన్ని మనం సినిమాలోనే చూసుకోవాల్సి ఉంటుంది.

ఎవరిది పై చేయి అవుతుందో
జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి తెలుగులో వార్ 2 భారీ స్థాయిలో విడుదలవుతోంది. హిందీ, తెలుగు, తమిళంలోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అదేరోజు కూలీ విడుదలవుతోంది కాబట్టి తమిళంలో వార్ 2కు థియేటర్లు దొరకడమే చాలా కష్టమవుతుంది. కూలీ ట్రైలర్ లో మూమెంట్స్ మాత్రమే ఉండేలా దర్శకుడు చూసుకున్నాడు. విక్రమ్ ట్రైలర్ విడుదలైనప్పుడు కూడా ఇదే స్పందన వచ్చింది. ఒకరకంగా వార్2, కూలీ.. రెండూ వేటికవే భిన్నం. అయితే ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేయగలిగే సత్తా ఉన్న సినిమాలే. ఎవరిది పై అవుతుందో తెలియాలంటే 14వ తేదీ వరకు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications