మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. దిల్ రాజు బ్యానర్‌లో పవర్ స్టార్ మూవీ !!

దిల్ రాజు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పూర్తిపేరు వంశీధర్ రావు కానీ సినిమా ఇండస్ట్రీలో అందరికి తెలిసిన పేరు మాత్రం దిల్ రాజు. దిల్ రాజు 2003లో 'దిల్' అనే చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ఆ చిత్రం మంచి హిట్ అయింది. అదే సినిమా ఆయనకు 'దిల్ రాజు' అనే టైటిల్‌ను తెచ్చిపెట్టింది. డిస్ట్రిబ్యూటర్ నుంచి మొదలైన ఆయన ప్రయాణం నేడు నిర్మాతగా, థియేటర్ ఓనర్, స్టూడియో ఓనర్ వరకు విస్తరించింది. విభిన్న కథాంశాలతో చిత్రాలను నిర్మిస్తూ టాప్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు.

ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవల మాత్రం వరుస అపజయాలను ఎదుర్కొంటున్నారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ ఆయనకు భారీ షాక్ ఇస్తే.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటించిన తమ్ముడు సినిమా కూడా గట్టెంకించలేకపోయింది. అయితే సినిమా ప్రొడక్షన్కన్నా ముందు డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు తన ప్రయాణాన్ని ఇండస్ట్రీలో మొదలుపెట్టారు.

dil-raju-comments-about-movie-with-power-star-pawan-kalyan

ఈ క్రమంలోనే ఆయన సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజి నిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను నైజాంలో దిల్ రాజు కొనుక్కున్నారు. సినిమా సక్సెస్ కావడంతో విపరీతమైన లాభాలు వచ్చాయి. ఆ సినిమా సక్సెస్ అనేది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని దిల్ రాజు చెప్పారు. అంతే కాకుండా గతంలో సైతం అమృత అనే సినిమా భారీ నష్టాలు తెచ్చినప్పుడు కూడా.. తొలిప్రేమ ఆదుకుందని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా హైదరాబాదులో కొంతమంది మెగా అభిమానులతో దిల్ రాజు ఓజి సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తరుణంలోనే మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారంట దిల్ రాజు. పవన్ కళ్యాణ్ హీరోగా తమ,అ బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లు అభిమానులతో పంచుకున్నారట. కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందని చెప్పారట. దీంతో పవన్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో పూజా కార్యక్రమాలతో సినిమా మొదలుపెట్టారు. ఆ మూవీకి రౌడీ జనార్ధన్ అనే పేరును ఫిక్స్ చేశారు.

పవన్ కళ్యాణ్ "ఓజీ" సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. తెలుగు రాష్ట్రాలే కాకుండా, ఓవర్సీస్ లో కూడా పవన్ మార్కెట్‌ను మరోసారి నిరూపించింది. పవర్ స్టార్ యాక్టింగ్, సుజీత్ స్టైలిష్ టేకింగ్, తమన్ మ్యూజిక్ కలిసి థియేటర్లు వణికించేలా చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. అలాగే శ్రేయ రెడ్డి, శుభలేఖ సుధాకర్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించి సినిమాకి మరింత బలం చేకూర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+