Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'గేమ్ ఛేంజర్' సినిమాను నేనే పైరసీ చేశా అన్నారు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఇటీవల గోదావరి జిల్లాల్లో నెలకొన్న ఎగ్జిబిటర్ల వివాదం, పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వాయిదా, పైరసీ సమస్యలు, ఛాంబర్ లోని ఐక్యత లేమి వంటి పలు విషయాలపై స్పందించారు. దిల్ రాజు మాట్లాడుతూ..మంత్రి దుర్గేష్‌కి ధన్యవాదాలు తెలిపారు. తొమ్మిది రోజుల నుంచి ఉన్న పరిస్థితులకి ఆయన ముగింపు పలికారు. సమస్య ఎక్కడో మొదలైంది, కానీ మంత్రి కృషితో అన్నీ సద్దుమణిగాయి.

ప్రజల్లో చాలా డైలమా నెలకొని ఉందని పేర్కొన్నారు.ఏప్రిల్ 19న గోదావరి జిల్లాల్లో ఎగ్జిబిటర్లు తమ ఇబ్బందులను లేవనెత్తారని, ఏప్రిల్ 26న జరిగిన గిల్డ్ మీటింగ్‌లో ఈ విషయం తమకు తెలిసిందని దిల్ రాజు తెలిపారు. ఎగ్జిబిటర్ల డిమాండ్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ఈ వివాదం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Dil Raju s response on theater closures and percentage policy

పవన్ కళ్యాణ్ సినిమా మే నెలలో విడుదల కావాల్సి ఉండగా, అది వాయిదా పడిందని దిల్ రాజు వెల్లడించారు. నైజాంలో మొత్తం 370 సింగిల్ స్క్రీన్స్ ఉండగా, అందులో SVCకి 30, ASIN సునీల్‌కు 90, మిగిలిన 250 ఓనర్స్‌వి ఉన్నాయని ఆయన వివరించారు.

'గేమ్ ఛేంజర్' పైరసీ వల్ల అందరికీ నష్టం వచ్చిందని, తన సినిమా తానే పైరసీ చేశారని అనడం సరికాదని దిల్ రాజు అన్నారు. 30 ఏళ్ల నుంచి ఎగ్జిబిటర్లు తమతో ఉన్నారని, ఛాంబర్‌లో ఎగ్జిబిటర్లకు మాట ఇచ్చినా, ప్రభుత్వంతో మాట్లాడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మే 18న ఎగ్జిబిటర్ల మీటింగ్ జరిగిందని, అయితే 'థియేటర్స్ బంద్' అనే మాటలో వాస్తవం లేదని దిల్ రాజు స్పష్టం చేశారు. రెంటల్ పర్సెంటేజ్ కావాలని అడుగుతున్నారని, బంద్ మాటను తాను ఖండించనని చెప్పారు. "ఛాంబర్‌లో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. మాకు పర్సెంటేజ్ విధానం కోసం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడాలి అన్నారు. చర్చలే జరగకుండా బంద్ ఏంటి? ఎవరూ ఖండించకపోవడం తప్పు. పరిశ్రమలో ఎవరి దారి వారిది" అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

"డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్‌లో సమస్యలు ఉన్నా సినిమాలు విడుదల చేస్తాం. మా థియేటర్స్ మాతో ఉన్నాయి. 56 రోజులు షూటింగ్ ఆపి ఏమీ సాధించలేదు. కోవిడ్ టైంలో మాత్రమే థియేటర్లు మూతపడ్డాయి" అని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు.

కళ్యాణ్ సినిమా ఉందని తన పేరు ఇండైరెక్ట్‌గా చెప్పారని, అయితే "కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు" అని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. దుర్గేష్ గారికి కూడా క్లారిటీ ఇచ్చానని, ప్రభుత్వానికి తప్పుగా సమాచారం అందించారని ఆయన అన్నారు. జూన్, జూలై, ఆగస్ట్‌లో సినిమాలు ఎక్కువగా ఉన్నాయని, ఏప్రిల్, మే లాంటి సీజన్లలో థియేటర్లలో సినిమాలు లేవని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని కలవాలని ఎవరూ అనుకోరని, కష్టాలు ఉంటేనే ప్రభుత్వం దగ్గరికి వెళ్తామని దిల్ రాజు చెప్పారు. "కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఏపీలో బాగానే ఉన్నాము. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు" అని ఆయన వెల్లడించారు. ఏపీలో తనకు ఉత్తరాంధ్రలో 20 థియేటర్లు ఉన్నాయని, అరవింద్ గారికి 15 థియేటర్లు ఉన్నాయని తెలిపారు. రెండు ప్రభుత్వాలు మంచి చేస్తున్నాయని అన్నారు."పెద్దన్న తిడతారు పడతాము, కళ్యాణ్ గారు తిడితే పడతాం" అని దిల్ రాజు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చేలా చేశారని, ఇది దురదృష్టకరం అన్నారు.

చివరగా, "ఛాంబర్‌లో యూనిటీ లేదు. అక్కడ కూడా అంతా సెట్ చేస్తాం. ఈ టాపిక్ ఇంతటితో ముగింపు పలకాలని మీడియాను కోరుతున్నాం. త్వరలో అన్ని సమస్యల పరిష్కారానికి కమిటీ వేసి సానుకూలంగా స్పందిస్తాం" అని దిల్ రాజు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+