అనిల్ రావిపూడి, రామ్ పోతినేని మధ్య గొడవ?
దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ సాధించి విక్టరీ వెంకటేష్ ను రేస్ లో నిలబెట్టేలా చేశారు. కుటుంబ కథకు ప్రాధాన్యం ఇస్తే, అందులో హాస్యం జోడిస్తే బ్రహ్మరథం పడతామని ప్రేక్షకులు చెప్పారు. ఈ సినిమా రూ.300 కోట్లు కొల్లగొట్టి సంచలన రికార్డు నెలకొల్పింది. రూ.400 కోట్ల వరకు అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతటి బ్రహ్మాండమైన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన అనిల్ రావిపూడి తన తర్వాత సినిమా చిరంజీవితో చేయబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి విశ్వంభర పూర్తయిన తర్వాత అనిల్ దర్శకత్వంలో చేసే అవకాశం ఉంది.
ఆ సినిమాకు రచయితగా పనిచేశారు
రామ్ పోతినేని మహేష్ దర్శకత్వంలో ఓ ప్రేమ కథాచిత్రం చేస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటిస్తోంది. రామ్ గతంలో చేసిన కందిరీగ, మసాలా, పండగ చేస్కో లాంటి సినిమాలకు అనిల్ రావిపూడి రచయితగా పనిచేశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఇద్దరూ మంచి స్నేహితులైన తర్వాత రామ్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు అనిల్ రావిపూడి. తొలి సినిమా పటాస్, తర్వాత సుప్రీం లాంటి సినిమాలు చేసిన తర్వాత రాజా దిగ్రేట్ సినిమా కథ రాసుకున్నారు. దీన్ని రామ్ తో చేయాలని కథ చెప్పగా రామ్ కూడా ఓకే చెప్పారు. షూటింగ్ కు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆ సమయంలో రామ్ అన్నీ యాక్షన్ సినిమాలే చేశారు. అవన్నీ ఫ్లాప్ కావడంతో కొంత టైం గ్యాప్ తీసుకొని సినిమా చేద్దామని రామ్ అనడంతో అనిల్ కూడా సరే అన్నాడు.

మనస్పర్థలే కారణమని వార్తలు వచ్చాయి
తర్వాత ఈ కథలో కొన్ని మార్పుచేర్పులు చేసి రవితేజకు వినిపించగా ఆయన ఓకే అన్నారు. వెంటనే ఈ సినిమా తీయడం, భారీ హిట్ సాధించడం జరిగిపోయింది. అయితే రామ్ తో తీయాల్సిన ఈ సినిమా తీయకపోవడానికి కారణం వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలే కారణమని తెలుగు ఫిలింనగర్ లో వార్తలు వచ్చాయి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అనిల్ ను ఈ ప్రశ్న అడగ్గా పైన చెప్పిన విషయాలనే చెప్పారు. వీరిద్దరి మధ్య గొడవ జరిగిందా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టతనివ్వలేదు. ఏదేమైనప్పటికీ రామ్ మంచి హిట్ సినిమా మిస్ చేసుకున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రామ్ చేస్తున్న సినిమా అయినా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. దీనికి ముందు చేసిన డబుల్ ఇస్మార్ట్ అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications