బోయపాటి రొమాంటిక్ లవ్ స్టోరీ.. హీరో ఎవరో తెలుసా?
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ చిత్రం చేస్తున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. చందు మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మిస్తున్నారు. దీనిపై నాగచైతన్య అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన రెండు చిత్రాలు థాంక్యూ, కస్టడీ చిత్రాలు పరాజయం పాలవడంతో తండేల్ పై ఆశలు పెట్టుకున్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను స్కంద సినిమాతో భారీ పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఆ సినిమాల్లో లాజిక్స్ లేని సన్నివేశాలే ఎక్కువంటూ విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అసలు రామ్ ఈ సినిమాను ఎందుకు ఒప్పుకున్నాడు? ఎలా ఒప్పుకున్నాడు? అంటూ అభిమానులు మండిపడ్డారు. తాజాగా బోయపాటి ఓ ప్రేమ కథతో చిత్రాన్ని తీయబోతున్నారు. దీనికి కథానాయకుడు ఎవరో కాదు.. నాగచైతన్య. అసలు నాగచైతన్యతో బోయపాటి ప్రేమ కథ తీయడమేంటంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

ప్రేమకథలకు నాగచైతన్య సరిగానే సెట్ అవుతారని, అయితే బోయపాటి ఆ సినిమాను ఎలా తీస్తాడనేది సందేహాస్పదమేనంటున్నారు. బాలకృష్ణతో మాత్రమే బోయపాటి హిట్లు ఇస్తాడని, ఇతర హీరోలకు సూపర్ హిట్లు ఇవ్వలేడంటున్నారు. సరైనోడు సినిమాతో అల్లు అర్జున్ కు, భద్ర, తులసి సినిమాలతో రవితేజ, వెంకటేష్ కు మాత్రమే హిట్లు ఇచ్చాడని, మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయాలని, అలాకాకుండా మాస్ ప్రేక్షకులు చూస్తారులే అంటూ లాజిక్స్ లేకుండా సినిమాలు తీస్తే నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఎప్పుడు ప్రారంభమవుతుంది? నిర్మాత ఎవరు? హీరోయిన్ ఎవరు? తదితర విషయాలు వెల్లడి కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications