ఫ్యాన్స్ దెబ్బకు సోషల్ మీడియా నుంచి దర్శకుడు పరార్
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణంలోనే సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. అయితే సోషల్ మీడియా వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ నుంచి అయిన ఎవరిపైనైనా విమర్శలు చేయవచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే సోషల్ మీడియా ద్వారా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు.
హీరోల అభిమానులు అయితే తమ అభిమాన హీరో నటిస్తోన్న సినిమాల అప్‌డేట్స్ కోసం చిత్ర దర్శకులను , నిర్మాతలను టార్చర్ పెడుతున్నారు. కొందరైతే ఫ్యాన్స్‌కు భయపడి సోషల్ మీడియాకు సైతం రావడం మానేశారు. తాజాగా ఓ దర్శకుడు అభిమానుల దెబ్బకు ట్విటర్ నుంచి వైదొలిగాడు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జిగ్రా'.ఈ సినిమాకు వాసన్ బాలా దర్శకత్వం వహించారు. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్లాప్ కావడంతో సోషల్‌మీడియా వేదికగా పలువురు నెటిజన్లు ఈ సినిమా పై నెగటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేశారు. అభిమానుల టార్చర్ భరించలేని దర్శకుడు వాసన్ బాలా ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు. ఇక అలియా భట్ నటించిన 'జిగ్రా' తెలుగులో కూడా విడుదలైంది. నటుడు రానా ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. మాటల మంత్రికుడు త్రివిక్రమ్, హీరోయిన్ సమంత 'జిగ్రా' సినిమాను ప్రమోట్ చేశారు. అలియా భట్ కోసం చాలాకాలం తర్వాత హైదరాబాద్‌కు వచ్చి మరీ 'జిగ్రా' సినిమాను ప్రమోట్ చేసింది సమంత. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తెలుగులో కూడా 'జిగ్రా' ఫ్లాప్‌గా నిలిచింది.












Click it and Unblock the Notifications