రామ్‌చరణ్‌తో సినిమా చేయనని చిరంజీవి ముఖంమీదే చెప్పేసిన డైరెక్టర్

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేశారు. రేపు విడుదల కాబోతోంది. దీనిపై అంచనాలు చాలా సాధారణంగా మాత్రమే ఉన్నాయి. అందుకు కారణం దర్శకుడు శంకర్. ఈ సినిమా హిట్ అయితేనే శంకర్ పరిశ్రమలో నిలదొక్కుకుంటాడు. లేదంటే అతనితో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కనపడటంలేదు. రామ్ చరణ్ తన కెరీర్ ప్రారంభంలో రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా చేశాడు. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడంతో తనతోపాటు ఉన్న హీరోలందరినీ దాటేసి స్టార్ హీరో అయ్యారు చెర్రీ. మాస్ ఇమేజ్ బాగా వచ్చేసింది. తర్వాత రామ్ చరణ్ ఏ సినిమా చేయాలా? అన్న ఆలోచనలో చిరంజీవి పడిపోయారు.

ఇమేజ్ బ్యాలెన్స్ చేయాలని చూస్తే బెడిసికొట్టింది
అల్లు అర్జున్ దేశముదురు సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత భాస్కర్ దర్శకత్వంలో పరుగు చేయడంతో అతని ఇమేజ్ బ్యాలెన్స్ అయింది. అలాగే రామ్ చరణ్ ఇమేజ్ బ్యాలెన్స్ అవ్వాలంటే క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు ఆరెంజ్ సినిమాను నిర్మించారు. మగధీర ఎంత హిట్ అయిందో, ఆరెంజ్ అంత ఫ్లాప్ అయింది. ఈ సినిమా తర్వాత ఏ దర్శకుడితో చేయాలా అని అనుకుంటుండగా పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయికానీ చిరంజీవికి ఎంతపట్టానా ఎవరితో చేయించాలనే విషయాన్ని కొలిక్కి తీసుకురాలేకపోయారు. చిరంజీవి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ ను నటింపచేయాలని భావించారు.

director K Vishwanath told Chiranjeevi that he would not do a film with Ram Charan

రామ్ చరణ్ కు అదృష్టం లేదు
చిరంజీవి స్వయంగా వెళ్లి కె.విశ్వనాథ్ ను అడిగారు. మీ దర్శకత్వంలో నటించాలని రామ్ చరణ్ ఉవ్విళ్లూరుతున్నాడని, మంచి కథ తీసుకొని సినిమా చేయాలని కోరారు. అయితే విశ్వనాథ్ దాన్ని తిరస్కరించారు. ప్రస్తుత తరంలో తన సినిమాలు ఆడవని, తన కథలు ఇప్పటితరానికి నచ్చవని, కాబట్టి సినిమా తీయకుండా ఉండటమే ఉత్తమమని, సినిమా చేయనని ఖరాఖండిగా చెప్పేశారు. ట్రెండ్ మారిందనే తాను సినిమాలకు దూరంగా ఉండి, కేవలం నటిస్తున్నానని చెప్పారు. విశ్వనాథ్ అంగీకరించివుంటే ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా కచ్చితంగా వచ్చివుండేదని అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఒక లెజెండరీ దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేసే అదృష్టం రామ్ చరణ్ కు కలగలేదని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+