బాలకృష్ణ బుద్దిని బయటపెట్టిన స్టార్ దర్శకుడు

టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ ఆగ్ర హీరో బాలకృష్ణకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. రాజకీయాలకు అతీతంగా ఆయన్ను అభిమానించే వారున్నారు. అయితే బాలకృష్ణకు ఇండస్ట్రీలో ఓ చెడ్డ పేరు కూడా ఉంది. బాలకృష్ణ అమ్మాయిలను వేధించే వారని గతంలో పలువురు ఆరోపణలు చేశారు. తమిళ నటి విచిత్ర ఓ ప్రముఖ తెలుగు హీరో తనని వేధించాడని చెప్పి సంచలనం సృష్టించింది. ఆమె ఆరోపణలు చేసింది టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ మీదనే అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. నటి విచిత్ర తెలుగు ఒక్క సినిమాలో నటించిందని..అది బాలకృష్ణ హీరోగా నటించిన 'భలేవాడివి బాసూ'సినిమానేనని నెటిజన్లు గుర్తు చేశారు. గతంలో బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది.

ఓ తెలుగు హీరో తనని బాగా ఇబ్బంది పెట్టాడని..దాంతో తెలుగులో సినిమాలు చేయడం మానేశానని రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది. అప్పుడు కూడా ఆ హీరో బాలకృష్ణ అనే మాటలు తెర మీదకు వచ్చాయి. ఇక బాలకృష్ఱ కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది ముక్కుసూటి తత్వం, ఆయన టెంపర్. తేడా వస్తే ఆయన తన చేతికి పని చెబుతుంటారు. బాలకృష్ణ చాలాసార్లు తమ అభిమానులపై చేయి చేసుకున్నారు. కొట్టడం బాలయ్యకు... కొట్టించుకోవడం ఆయన ఫ్యాన్స్‌కు అలవాటుగా మారిపోయింది.

Director KS Ravikumar revealed shocking facts about Balakrishna

సెట్స్‌లో బాలకృష్ణ అసిస్టెంట్స్‌ని కొడుతున్న వీడియోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. తాజాగా బాలకృష్ణ గురించి స్టార్ దర్శకుడు కే ఎస్ రవికుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ రోజు సినిమా షూటింగ్‌లో నవ్వాడని బాలకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్‌ని కొట్టబోయాడు. నేను బ్రతిమిలాడి బాలకృష్ణను ఆపాను. తనని చూసి నవ్వితే బాలకృష్ణకు ఇట్టే కోపం వస్తుంది. ఆయనతో రెండు మూడు సందర్భాల్లో నాకు అలాంటి అనుభవమే ఎదురైందని కే ఎస్ రవికుమార్ చెప్పుకొచ్చారు. బాలకృష్ణ, కే ఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో ''జై సింహ'' అనే సినిమా తెరకెక్కింది. 2018లో సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+