త్రివిక్రమ్ ను పిలిచిన స్టార్ హీరో.. సిద్ధమవుతున్న కథ!

మాటల మాంత్రికుడైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఏమీ మాట్లాడటంలేదు. ఎందుకంటే గుంటూరు కారం సినిమా పరాజయానికి సంబంధించి ఆయన సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా గుంటూరు కారంకు కూడా రివ్యూ ఇచ్చారు. ఇది మహేష్ బాబు స్థాయి సినిమా కాదని, దర్శకుడుగా త్రివిక్రమ్ తర్వాతైనా మంచి కథతో రావాలనుకుంటున్నానని, సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకోవడంవల్ల కథలో మార్పులు వచ్చి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కలెక్షన్లు వస్తాయని, అయితే డబ్బులు రావడం లేరు, తృప్తి వేరన్నారు.

దీంతో మరోసారి త్రివిక్రమ్ పై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. తన తర్వాత సినిమాను నాని, వెంకటేష్, సూర్య, అల్లు అర్జున్, ఎన్టీఆర్ తో చేయబోతున్నారంటూ.. ఇలా హీరోలందరి పేర్లు బయటకు వస్తున్నాయి కానీ అతన్నుంచి స్పష్టత లేదు. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ పేరు బయటకు వచ్చింది. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో దళపతి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చేసేదే తన చివరి సినిమా అని అంటున్నారు. తర్వాత విజయ్ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారు. అయితే తన చివరి సినిమాగా తెలుగు నిర్మాత డీవీవీ దానయ్యతో చేయబోతున్నారు. ఈ సినిమా కోసం దానయ్య విజయ్ కు రూ.200 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

director trivikram srinivas will work with tamil stra hero vijay

తమిళ దర్శకులు చెప్పిన కథలేవీ విజయ్ కు నచ్చలేదు. దీంతో మంచి కథను తయారు చేయాలంటూ దానయ్య త్రివిక్రమ్ ను కలిసినట్లు సమాచారం. దీంతో విజయ్ కోసం భారీ బడ్జెట్ తో ఓ మంచి కథను త్రివిక్రమ్ తయారుచేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. కథ ఓకే అయితే త్రివిక్రమ్ తన తర్వాత సినిమాగా విజయ్ తో చేసే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఒక్క సినిమా ఫ్లాపైనంత మాత్రాన తన సత్తా ఏమీ తగ్గలేదని నిరూపించుకునే అవకాశం కూడా దక్కిందంటున్నారు. చూడాలి చివరకు ఏమవుతుందో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+