"భర్త కోసం వెతుకుతున్న భార్య" - విజయ్ పై ఉదయనిధి విమర్శలు..!
ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై సమాధానంగా విజయ్ (Vijay) చేసిన ప్రసంగం డీఎంకేకు మంట పుట్టిస్తోంది. విజయ్ తన ప్రసంగంలో విపక్ష డీఎంకేపై చేసిన విమర్శలు వారిని ఎక్కడో తాకాయి. దీంతో విజయ్ తీరుపై మండిపడుతూ డీఎంకే నేతలు వరుసగా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) కూడా ఘాటుగా స్పందించారు. విజయ్ వ్యక్తిగత జీవితంపైనా ఆయన విమర్శలకు దిగారు.
గవర్నర్ ప్రసంగానికి సమాధానం ఇచ్చే క్రమంలో ముఖ్యమంత్రి విజయ్ ముందే రాసుకున్న స్క్రిప్ట్‌తో, దూషణలతో కూడిన నటన ప్రదర్శించారని తమిళనాడు అసెంబ్లీలో విపక్షనేత ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. విద్యుత్ కోతలు, రైతుల సమస్యలు, శాంతిభద్రతలు, నెరవేరని హామీల వంటి వాస్తవ సమస్యలను ఆయన విస్మరించారని ఆరోపించారు. అసెంబ్లీలోని లైవ్ కెమెరాను ఒక సినిమా సెటప్‌లా భావించి ఎక్కడా ఆగకుండా 'సింగిల్-టేక్'లో ప్రసంగించారని ఎద్దేవా చేశారు.

నిరసన తెలుపుతున్న రైతులను ప్రతిపక్షం రెచ్చగొట్టిందని అనడం, అసంబద్ధమైన ఒక పిట్ట కథ చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరును ఉదయనిధి ఖండించారు.అక్కడితో ఆగకుండా విజయ్ వ్యక్తిగత జీవితంపై ఉదయనిధి ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. చెంగల్‌పట్టు కోర్టులో తన భర్త కోసం వెతుకుతున్న భార్య కథ కూడా మాకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. విజయ్, ఆయన భార్య సంగీత మధ్య చెంగల్‌పట్టు కోర్టులో పెండింగ్‌లో ఉన్న విడాకుల కేసును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వేదికపై విజయ్ వైవాహిక జీవితం గురించి ఉదయనిధి స్టాలిన్ బహిరంగంగా ప్రస్తావించడం ఇదే మొదటిసారి.













Click it and Unblock the Notifications