ఆ సినిమా బ్లాక్ బస్టర్.. అక్కినేని అభిమానిగా చెప్తున్నా !
తెలుగు చిత్ర పరిశ్రమలోని యంగ్ డైరెక్టర్ లలో వెంకీ అట్లూరి కూడా ఒకరు. నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టి.. ఆ తర్వాత రచయితగా మారి.. ఇప్పుడు వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలిప్రేమ చిత్రంతో మంచి హిట్ అందుకొగా.. ఆ తర్వాత అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ను, నితిన్ తో చేసిన రంగ్ దే సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ రెండు సినిమాల రిజల్ట్ తో రూట్ మార్చాడు వెంకీ.
తెలుగు హీరోలను పక్కన పెట్టి కోలీవుడ్, మాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడం ప్రారంభించారు. తమిళ్ స్టార్ హీరో ధనుష్‌తో చేసిన 'సార్', మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్' మంచి హిట్స్ అందుకున్నాయి. ఇక స్టార్ హీరో సూర్యతో ఒక మూవీ చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా ఫిక్స్ అవ్వగా.. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చనున్నారు.

అక్కినేని అభిమాని..
వెంకీ అట్లూరి స్వతహాగా అక్కినేని ఫ్యామిలీ అభిమాని అని అందరికీ తెలిసిందే. లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ.. అక్కినేని హీరోల పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. నాగ చైతన్య, అఖిల్ లపై చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అఖిల్ గురించి మాట్లాడుతూ.. ఈసారి బ్లాక్ బస్టర్ హిట్టు కొడతాడని ధీమా వ్యక్తం చేశారు. ఆ సినిమా కచ్చితంగా ఆడుతుందని.. పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఆ సినిమా కథ విన్నానని.. ఒక అక్కినేని ఫ్యాన్ గా చెబుతున్నా ఆ సినిమా మాత్రం తప్పకుండా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పారు.
అఖిల్ ప్రస్తుతం మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో 'లెనిన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని టాక్ నడుస్తోంది. ఇక గతంలో అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు అలానే నాగచైతన్య గురించి చెబుతూ.. తాను ఇప్పటి వరకూ రాసుకున్న ప్రతీ కథ ఫస్ట్ చైతన్యకే చెప్పానని.. తీసిన 5 సినిమాలు ప్రతీది మొదట ఆయనకే చెప్పానని అన్నారు. ప్రతీసారి డేట్స్ కుదరకపోవడమో, వేరే కారణం వల్లనో ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదని తెలిపారు. కలిసినప్పుడల్లా ఆ విషయంపై జోక్స్ వేసుకుంటామని.. నెక్స్ట్ టైం కలిసి పని చేద్దామని మాట్లాడుకుంటామని చెప్పారు. అయితే నాగ చైతన్య ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారు. 'NC 24' అనే వర్కింగ్ టైటిల్ తో మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఆ మూవీ రూపొందుతుంది. మీనాక్షీ చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications