మంచు విష్ణు, మనోజ్ మధ్య భగ్గుమన్న విభేదాలు?
తెలుగు సినీ పరిశ్రమల్లో ఉన్న పెద్ద కుటుంబాల్లో ఒకటైన మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మోహన్ బాబు కొడుకులిద్దరు విష్ణు, మనోజ్ మధ్య ఇప్పటికే మనస్పర్థలు ఉన్నాయనే విషయం తెలిసిందే. విష్ణు ప్రస్తుతం కన్నప్ప పేరుతో భారీస్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు. మనోజ్ సినిమాలు చేసినప్పటికీ మౌనికను వివాహం చేసుకున్నతర్వాత దూరంగా ఉంటున్నారు. అయితే కొన్ని సినిమాల్లో ప్రతినాయకుడిగా నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయికానీ వాటిని మనోజ్ అధికారికంగా ధ్రువీకరించలేదు.
విష్ణు గురించి ప్రస్తావించని మనోజ్
విష్ణు, మనోజ్ మధ్య జరిగిన గొడవ మీడియాలో హైలైట్ అయిన విషయం తెలిసిందే. ఒక షో కోసం ఇలా చేస్తున్నాంటూ చెప్పారుకానీ అది వాస్తవంగా జరిగిన గొడవే. తర్వాత కూడా ఇద్దరి మధ్య సఖ్యత కుదర్లేదని తెలుగు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది. మరోసారి ఈ ప్రచారానికి విష్ణు, మనోజ్ ఇద్దరూ ఊతమిచ్చేలా వ్యవహరించారు. ఇటీవలే మనోజ్ కు ఒక పాప జన్మించగా దేవసేన శోభ ఎంఎం అనే పేరు పెట్టారు. ఈ పేరు ఎందుకు పెట్టామో తెలియజేస్తూ మనోజ్-మౌనిక ఒక నోట్ విడుదల చేశారు. అందులో మనోజ్ తండ్రి మోహన్ బాబు, తల్లి నిర్మలాదేవి, అక్క లక్ష్మి, మౌనిక అక్కడ, తమ్ముడి గురించి ప్రస్తావించాడుకానీ విష్ణు గురించి మాత్రం ప్రస్తావించలేదు.

కావాలనే విష్ణు విస్మరించారా?
కావాలనే మనోజ్ విష్ణును విస్మరించినట్లు అర్థమవుతోంది. ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ గురించి ఇప్పుడు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నటుడు సాయిదుర్గాతేజ్ ఖండించాడు. తర్వాత మనోజ్ స్పందిస్తూ అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. ఆ తర్వాత స్పందించిన మంచు విష్ణు సాయిదుర్గాతేజ్ ను బ్రదర్ అని సంభోదించాడు. మనోజ్ చేసిన ట్వీట్ ను అసలు పట్టించుకోలేదు. సాయిదుర్గాతేజ్ ను విష్ణు కొనియాడాడు. దీంతో మంచు కుటుంబంలో ఉన్న విభేదాలు ఈ ట్వీట్ ద్వారా మరోసారి బహిర్గతమయ్యాయని పరిశ్రమలో చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications