అక్కినేని - దగ్గుబాటి కుటుంబాల మధ్య పెరిగిన దూరం?
కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య ఈనెల 8వ తేదీన శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఆరునెలల్లోగా వివాహం జరిపించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. నాగార్జున ఇంట్లో, కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిపారు. ఈ వేడుకకు అమెరికాలో ఉన్న నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి హాజరు కాలేదు. ఆమెకు నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, సమంతకు విడాకులివ్వడం అస్సలు ఇష్టం లేదంటూ జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఆ సంస్థ నాగచైతన్య నిశ్చితార్థంపై ప్రసారం చేసిన కథనం ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తోంది.
దగ్గుబాటి రామానాయుడు కుమార్తె, వెంకటేష్ సోదరి అయిన లక్ష్మిని నాగార్జున పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత మనస్పర్థం రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. లక్ష్మీ నాగచైతన్యను తీసుకొని అమెరికాలో స్థిరపడ్డారు. నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకోవడం ఆమెకు ఎంతో ఇష్టం. అంతేకాదు.. సమంతను బాగా ఇష్టపడుతుంది. విడాకులు తీసుకొని శోభితతో నిశ్చితార్థం జరుపుకున్నప్పటికీ సమంతతో దగ్గుబాటి లక్ష్మి ఇప్పటికీ మాట్లాడుతున్నారు. సమంతను ఆమె తన కోడలిగా మనస్ఫూర్తిగా ఇష్టపడిందని, అందుకే మొన్నటి నిశ్చితార్థానికి రాలేదని ఆ కథనంలో పేర్కొన్నారు.

సమంతకు మయోసైటిస్ సోకినప్పుడు ఆమె ఎంతో బాధపడిందని, ఎప్పటికప్పుడు ఆమె బాగోగులను ఫోన్ చేసి తెలుసుకునేదని వార్తలు వస్తున్నాయి. సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్యతో మాట్లాడటం తగ్గించేసింది. రేపు జరగబోయే పెళ్లికైనా వస్తుందా? లేదా? అనే సందేహం అందరినీ వెంటాడుతోంది. ఎందుకంటే పెళ్లిలో కొడుకు తన తల్లి ఆశీర్వాదం తీసుకోవడం చాలా ముఖ్యం. సమంతతో వైవాహిక బంధంలో ఉన్న సమయంలోనే నాగచైతన్య శోభితతో రిలేషన్ లో ఉన్నాడని, ఈ విషయంవల్లే సమంత, చైతూ విడిపోయారని వార్తలు వచ్చాయి. ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టే లక్ష్మి తన కొడుక్కి దూరంగా ఉంటోందని, మాజీ కోడలితో మాత్రం దగ్గరగా ఉంటోందంటున్నారు.












Click it and Unblock the Notifications