ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ బయటకు.. సంచలన విషయాలు వెలుగులోకి..!
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఈ వివాదంపై స్పందించిన ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఇందులో వాస్తవం లేదని స్టేటస్ పెట్టారు. ఆ తర్వాత ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
అయితే ఈ అంశానికి సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ ఇప్పుడు బయటకు వచ్చింది. రెండు పేజీల లేఖలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన లేఖలో పొందుపరిచారు. ట్రైనీ ఐపీఎస్ అధికారిణితో సంవత్సరం నుంచి రిలేషన్ లో ఉన్నామని.. పెళ్లి తర్వాత కూడా సన్నిహితంగా ఉన్నామని ఉదయ్ కృష్ణారెడ్డి తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ సూసైడ్ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సూసైడ్ లేఖ రాసిన అనంతరం సోమవారం ఉదయం ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. మోతీనగర్ లోని బంధువు ఇంటికి వచ్చిన ఉదయ్.. శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడ్ని బంధువులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఇక ట్రైనీ ఐపీఎస్ అధికారిణి తన ఫిర్యాదులో ఉదయ్ కృష్ణారెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనకు అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టాడని.. తన అనుమతి లేకుండా ప్రైవేట్ వీడియోలు తీసి ఆ వీడియోలు తన భర్తకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేశాడని తెలిపారు. ఈ మేరకు ఉదయ్ కృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications