16ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం దిశగా కేంద్రం అడుగులు
సోషల్ మీడియా వినియోగం సమాజంలో విపరీతంగా పెరిగింది. పొద్దున్న లేచిన దగ్గర నుండి సోషల్ మీడియాలోనే ఉంటున్న వారు, ముఖ్యంగా యువత, 16ఏళ్ళ లోపు పిల్లల సంఖ్య బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియా వినియోగం కారణంగా పిల్లలపై అనేక దుష్ప్రభావాలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పదహారేళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా ఆంక్షలు విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలన చేస్తోంది.
పదహారేళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా ఆంక్షలు
సోషల్ మీడియా వినియోగం చిన్నారుల మనసులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న వేళ కేంద్రం దీనిపై ఆలోచిస్తున్నట్టు, పదహారేళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా ఆంక్షలు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడించారు. ఇటీవల వారు ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో 16 ఏళ్ళ లోపు చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధిస్తూ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు.

ఆస్ట్రేలియాలో ఇప్పటికే చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్
ఇది చారిత్రాత్మక నిర్ణయం అని, ప్రపంచానికి స్ఫూర్తి దాయక నిర్ణయం అని ఆ దేశ ప్రధాని అంథోని అల్బనీస్ తో చెప్పారు. సోషల్ మీడియా నియంత్రణలో ఆస్ట్రేలియా చట్టాల నుండి భారత్ చాలా నేర్చుకుంటుందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధాని మన దేశంలో కూడా ఇలాంటి నిబంధనలు తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ అంశంపైన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ మాట్లాడారు.
లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోనున్న భారత్
ఇతర దేశాల్లో సోషల్ మీడియా నియంత్రణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నాయో అధ్యయనం చేస్తున్నామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని, చర్చలు జరుపుతున్నామని అన్నారు. ఇప్పటికే భారత్ లో పార్లమెంటరీ స్థాయి సంఘాలతో సహా వివిధ వర్గాలు ఈ ముప్పు గురించి చర్చ చేస్తున్నాయని అన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే పనిష్మెంట్ వారికి
ఆస్ట్రేలియా చట్టం ప్రకారం, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ఎక్స్, టిక్ టాక్ వంటి ప్రధాన సోషల్ మీడియా వేదికలో పదహారేళ్లలోపు వినియోగదారులను నిరోధించే వయసు నిర్ధారణ చర్యలు చేపడుతుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చిన్నారులు,తల్లిదండ్రులకు కాదు సదరు కంపెనీలకే జరిమానా విధిస్తారు. ఇక సోషల్ మీడియా కోసం ఇలాంటి భద్రతా చర్యలపైన అన్ని దేశాలు దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా చిన్నారుల సోషల్ మీడియా నియంత్రణపై ఫోకస్ చేస్తుంది.












Click it and Unblock the Notifications