వెన్నులో వణుకు పుట్టించే మలయాళీ హార్రర్ థ్రిల్లర్.. ఓటీటీలో స్ట్రీమింగ్

మలయాళం సినిమాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాళ్లు ఎక్కువగా హార్రర్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ చిత్రాలు తీస్తుంటారు. ఈ మూవీస్ ను మలయాళీ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా చూస్తుంటారు. అయితే మలయాళంలో ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది సీక్రెట్ ఆఫ్ కళింగ చిత్రం. థియేటర్లలో ఈ చిత్రం వెన్నులో వణుకు పుట్టించింది.

ఈ మూవీకి సనీష్ ఉన్ని కృష్ణన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ జులై 24 నుంచి డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. వినూత్నమైన కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు.

జూన్ 18 న థియేటర్లలో విడుదలైన 'సీక్రెట్ ఆఫ్ కళింగ' చిత్రం ఆడియన్స్ ను విశేషంగా అలరించింది. ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే హైలెట్ గా నిలిచింది. జిష్ణు ఎమ్. ఆర్యన్ తో కలిసి ఆయన రాసిన స్క్రీన్‌ ప్లే ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టింది. ఈ చిత్రానికి అశ్రిత్ సంతోష్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆ విజువల్స్ తెరపై అద్భుతంగా వచ్చాయి. అలాగే ధనుష్ హరికుమార్, విమల్ జిత్ విజయన్ కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

Malayalam fantasy-horror thriller Secret of Kalinga heads to OTT streaming from July 24 ott movie

'సీక్రెట్ ఆఫ్ కళింగ' మూవీలో మాళవిక మీనన్, అల్తాఫ్ సలీమ్, రియాజ్ ఖాన్, మెరీనా మైఖేల్ వంటి నటులు కీలక పాత్రల్లో మెరిశారు. 'ఐరా' బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ మేరకు మిస్టరీ థ్రిల్లర్ డిజిటల్ రైట్స్ ను సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. జూలై 24 న స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+