US-Iran War: అమెరికాతో వార్ లో కీలక మలుపు-ఇరాన్ సంచలన ప్రకటన..!
మళ్లీ అమెరికా-ఇరాన్ యుద్దం (US-Iran war) మొదలైపోయింది. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరువర్గాలూ తూట్లు పొడుచుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఇరాన్ పై అమెరికా, గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ లపై ఇరాన్ దాడులు, ప్రతిదాడులకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇవాళ సంచలన ప్రకటన చేసింది. అమెరికాతో పూర్తి స్థాయి యుద్దం ప్రారంభిస్తున్నట్లు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్టియాన్ ఓ ప్రకటన చేశారు.
అమెరికాతో తమ దేశం పూర్తి స్థాయి యుద్ధంలో ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, తమ హక్కులు, ప్రయోజనాలు లేదా సూత్రాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పేశారు. ప్రస్తుత సంఘర్షణ కేవలం క్షిపణులకు సంబంధించినది మాత్రమే కాదని ఆయన పేర్కొన్నారు. సైనిక చర్యల ద్వారా ఇరాన్‌ను లొంగదీసుకోవడంలో తమ ప్రత్యర్థులు విఫలమయ్యారని ఆయన తెలిపారు. నేటి యుద్ధం కేవలం క్షిపణులకు పరిమితమైనది కాదు, సైనిక దాడుల ద్వారా మన ప్రజలను లొంగిపోయేలా చేయడం తమ వల్ల కాదని శత్రువు గ్రహించాడన్నారు.

అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ, ఇరాన్ తన జాతీయ వైఖరికి కట్టుబడి ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు వెల్లడించారు.
అమెరికాతో ప్రతిష్టంభన తీవ్రమవుతున్న నేపథ్యంలో, దేశం ఐక్యంగా ఉండాలని పెజెష్కియన్ దేశ ప్రజల్ని కోరారు. ఇవాళ మనకు గతంలో కంటే ఎక్కువగా ఐక్యత, సంఘీభావం, సామూహిక వివేకం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం అవసరమని ఆయన తెలిపారు. మధ్యవర్తులు ఈ ఉద్రికతల్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో పెజెష్టియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇరాన్ మధ్యవర్తులు దాడులను 10 రోజుల పాటు నిలిపివేయాలని ఇప్పటికే ప్రతిపాదించారు. సంఘర్షణను ముగించే లక్ష్యంతో కుదిరిన మధ్యంతర కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications