కాకరకాయ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే కాకరకాయలు తిననివాళ్ళు కూడా రోజూ కావాలంటారు!

కాకరకాయ ఆరోగ్యానికి మంచిది. కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది తినరు. కానీ సరైన పద్ధతిలో కాకరకాయ పచ్చడి తయారు చేస్తే చేదు పూర్తిగా పోయి రుచికరమైన నిల్వ పచ్చడి తయారవుతుంది. వేడి అన్నంతో కలిపి తింటే ఈ కాకర కాయ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. బయట ఉంచితే ఒకటి రెండు నెలలు, ఫ్రిజ్‌లో ఉంచితే మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది.

కావలసిన పదార్థాలు:

కాకరకాయలు - అర కిలో
చింతపండు - 80 గ్రాములు
మెంతులు- ముప్పావు టీస్పూన్,
ఆవాలు - ఒక టేబుల్‌స్పూన్
జీలకర్ర - రెండు టీస్పూన్ లు
నువ్వుల నూనె - 400 గ్రాములు,
ఉప్పు - అరకప్పు,
కారం - ఒక కప్పు ,
పసుపు - ఒక టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 15-20
ఇంగువ- పావు టీస్పూన్
ఎండుమిర్చి - 2-3
కరివేపాకు 2 రెమ్మలు

Easy Kakarakaya Nilva Pachadi recipe without bitterness Know how to make perfect kakarayaka pachadi

తయారీ విధానం:

కాకరకాయలను బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టి చక్రాలుగా కట్ చేయాలి. గింజలు తీయనవసరం లేదు. మళ్లీ కొంతసేపు ఆరబెట్టాలి. ఆపైన స్టవ్ వెలిగించి నూనె వేడి చేసి కాకరకాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండును నీళ్లలో వేసి ఉడికించి, చల్లార్చి మెత్తగా గ్రైండ్ చేసి జల్లెడ పట్టాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించి పొడి చేసుకోవాలి.

కాకరకాయ పచ్చడి ఇలా చేస్తే సూపర్ టేస్ట్

కాకర కాయలు వేయించిన నూనెలో వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు చేయాలి. చింతపండు గుజ్జు వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి, ఉప్పు, కారం, పసుపు, వేయించిన కాకరకాయ ముక్కలు, వెల్లుల్లి కలిపి, చల్లారిన తర్వాత పోపు వేసి బాగా కలపాలి.

పుల్లకంద పులుసు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్!
పుల్లకంద పులుసు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్!

కాకరకాయలు తినని వాళ్ళు కూడా కావాలనే పచ్చడి

ఇలా కలిపిన పచ్చడిని రెండు రోజులు ఉంచి తర్వాత వాడుకోవచ్చు. నూనె పైన పొరలా ఉండేలా చూసుకోవాలి. ఈ పచ్చడి చేదు లేకుండా కమ్మగా ఉంటుంది. ఇలా కాకరకాయ పచ్చడి చేస్తే అసలే కాకరకాయలు తినని వాళ్ళు కూడా కాకరకాయ పచ్చడి కావాలంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+