సైలెంట్ గా వచ్చి 100 కోట్లు కొల్లగొట్టిన చిన్న సినిమా.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..!

ఇటీవలి కాలంలో చిన్న సినిమాలదే హవా నడుస్తోంది. సరైన కంటెంట్ తో వస్తున్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ ముందు ప్రభంజనం కొనసాగిస్తున్నాయి. ప్రేక్షకులను మెప్పిస్తూ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక డివోషనల్ టచ్ తో వస్తున్న సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతున్నాయి. తెలుగులో ఇటీవల మాస్ మహారాజ రవితేజ నటించిన ఇరుముడి మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు సృష్టించిన సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్ లోనూ హనుమాన్ అంశ్ అనే హిందీ మూవీ ప్రభంజనం కొనసాగుతోంది. కేవలం రూ. 2 కోట్లతో నిర్మితమైన హనుమాన్ అంశ్ మూవీ ఇప్పటికే రూ. 100 కోట్లు వసూలు చేసింది. ఇంతటి ఘన విజయం దక్కడానికి కారణం ఈ మూవీలోని డివోషనల్ పాయింట్ ఉండటమే కారణంగా చెప్పవచ్చు.

ఇక కలియుగంలో హనుమాన్ అవతారంగా చెప్పబడే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం, బోధనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ చిత్రానికి తాజాగా ఉత్తరాఖండ్‌ లో ట్యాక్స్-ఫ్రీగా ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. డెహ్రాడూన్‌ లోని ఒక సినిమా హాల్‌ లో తన సతీమణి గీతా ధామితోపాటు కేబినెట్ మంత్రులు గణేష్ జోషి, ప్రదీప్ బాత్రా, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం ఈ సినిమాను వీక్షించారు. అనంతరం సినిమాను ప్రశంసిస్తూ ఉత్తరాఖండ్ లో ఈ మూవీకి ట్యాక్స్ ఫ్రీ గా ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తి అంటే కేవలం ఆరాధన మాత్రమే కాదని.. సేవ, మానవతా దృక్ఫథమే మార్గమని నీమ్ కరోలి బాబా జీవితం మనకు చాటిచెబుతుందని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.

HanumanAnsh which grossed 100 crore at the box office tax-free by the Chief Minister of Uttarakhand

హనుమాన్ అంశ్ చిత్రానికి విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వం వహించారు. ఈ మూవీలో శోభినావ్ సత్య ప్రధాన పాత్రలో నటించారు. ఆయనతోపాటు విహాన్‌ షెడ్గే, చందన్ కె ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఆగస్టు 7 న విడుదల కాగా తొలి రెండు వారాలపాటు సాధారణ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత మౌత్ టాక్ తో ఇప్పటివరకు రూ. 97.77 కోట్ల గ్రాస్ రూ. 82.88 కోట్ల నెట్ వసూళ్లను సాధించిందని బాక్సాఫీస్ ట్రేడ్ నివేదికల ప్రకారం స్పష్టం అవుతోంది. ఇక మున్ముందు ఈ మూవీ ఇంకెన్ని రికార్డుల్ని బద్దలు కొడుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+