US Military Strikes: ఇరాన్ ఆయిల్ ట్యాంకర్స్ పై అమెరికా ప్రతీకార దాడులు

పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఇరాన్ కు చెందిన మూడు చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడులకు పాల్పడింది. అంతకుముందు ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దళాలు అమెరికాకు చెందిన యుద్ధ నౌకలపై దాడులు చేపట్టిన నేపథ్యంలో ఇరాన్ పై అమెరికా సైన్యం ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్ కు కీలకమైన ఆయిల్ రీఫైనరీ ఖర్గ్ ఐలాండ్ సమీపంలోని ట్యాంకర్లపైనా బాంబు దాడులు జరిగాయి. యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇందుకు సంబంధించిన వివరాలను తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. అమెరికా సైన్యం ధ్వంసం చేసిన చమురు ట్యాంకర్లలో ఎంటీ డౌనీ, ఎంటీ స్టార్క్ 1 లు ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ దాడుల్లో అమెరికా సైన్యానికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది.

ఇదే విషయంపై యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మైరల్ బ్రాడ్ కూపర్ మాట్లాడుతూ.. తమను తాము రక్షించుకునేందుకు అమెరికా ఎప్పుడూ వెనకడుగు వేయదని అన్నారు. అవసరమైతే ఇరాన్ కు చెందిన చమురు ట్యాంకర్లపైనా దాడులు చేస్తుందని తెలిపారు. ఈ మేరకు ఐఆర్జీసీకు క్లియర్ సందేశం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మీరు మా షిప్స్ లో రెండింటిని ధ్వంసం చేస్తే.. మేము మరింత రెచ్చిపోయి మీకు సంబంధించిన మూడు ట్యాంకర్లను మేము పేల్చేశాం.. మా సైన్యాన్ని కాపాడుకోవడానికి మేము ఎక్కడికైనా వెళ్తాం.. అని స్పష్టం చేశారు. అంతకుముందు ఖర్గ్ ఐలాండ్‌ వద్ద ఉన్న తమ ఆయిల్ ట్యాంకర్‌ పై అమెరికా మిస్సైల్ దాడి చేసిందని ఇరాన్ కీలక ఆరోపణలు చేసింది.

US Military Strikes latest now US retaliatory attacks on Iranian oil tankers tensions in West Asia

ఇరాన్ తీరానికి ఖర్గ్ ఐలాండ్ సుమారు 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇరాన్ నుంచి చమురు రవాణాకు ఈ దీవి చాలా కీలకంగా భావిస్తారు. ఇక్కడినుంచే ముడి చమురును ఇరాన్ విదేశాలకు తరలిస్తుంది. ఈ క్రమంలోనే అమెరికా ఈ ఖర్గ్ ఐలాండ్ లక్ష్యంగా దాడులు చేపట్టినట్లు స్పష్టం అవుతోంది. ఇక తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ లోని పిక్కేక్స్ పర్వతంపై దాడులు చేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అంతేకాక హర్మూజ్ జలసంధి ప్రస్తుతం తమ బలగాల పూర్తి ఆధీనంలోనే ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న రాడార్ వ్యవస్థల్ని, యుద్ధ విమానాలు, నౌకల్ని అమెరికా సైన్యం ధ్వంసం చేసిందని అన్నారు. ఇక ఇరాన్- అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+