నిన్న థియేటర్లో రిలీజ్.. ఈరోజు ఓటీటీలోకి వచ్చేసిన మూవీ !
చిత్ర పరిశ్రమలో ఎప్పుడు జరగని ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మూవీస్ థియేటర్ లో రిలీజ్ అవ్వడం లేదా ఓటీటీలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి.. ఆ తర్వాత కొన్ని రోజులకి ఓటీటీ లోకి రావడం సహజమే. కానీ అనూహ్యంగా చిత్రం థియేటర్లోకి వచ్చిన తర్వాత రోజే ఓటీటీ లోకి రావడం అంటే పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇంతకీ ఆ మూవీ ఏంటి ? ఆ విషయం ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
యంగ్ హీరో అధర్వ మురళి, నిమిషా విజయన్ జంటగా నటించిన చిత్రం 'DNA'. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో 2014లో ఒక నిజమైన సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. తమిళంలో జూన్ 20న విడుదలై విజయం సాధించింది. అయితే ఈ మూవీనే 'మై బేబీ' (My Baby) పేరుతో తెలుగులో జూలై 18న తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల చేశారు. కానీ అనూహ్యంగా ఈరోజు ( జూలై 19, 2025) ఓటీటీ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు.

స్టోరీ..
ఆనంద్ అనే వ్యక్తి ప్రేమలో విఫలమైన తర్వాత దివ్య అనే యువతిని పెళ్లి చేసుకుంటాడు. దివ్యకు బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. ఆమె డెలివరీ సమయంలో ఆసుపత్రిలో జరిగిన సంఘటన వల్ల, పుట్టిన శిశువు తనదే కాదని అనుమానించి, ఆసుపత్రి అధికారులను నిలదీస్తుంది. ఆమె ఆరోపణలను మాత్రం ఆసుపత్రి అధికారులు, కుటుంబ సభ్యులు నమ్మరు. కానీ భర్త ఆనంద్ మాత్రం ఆమెకు సపోర్ట్ గా ఉండి.. నిజాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు.
ఈ సినిమా కథ నిజజీవిత సంఘటనల ఆధారంగా ఉండడం పెద్ద హైలైట్. పుట్టిన బిడ్డను ఆసుపత్రిలో మారుస్తున్న ఘటనలు ఇప్పటికి చాలానే జరిగాయి. అలాంటి ఘటనే ఒక కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అని బాగా చూపించారు.

తమిళంలో విడుదలైన ఒక నెల తర్వాత, తెలుగులో జూలై 11న విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ సమస్యలతో జూలై 18కి వాయిదా పడింది. అయితే జియో హాట్‌స్టార్‌తో ముందుగా ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో జూలై 19న సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్‌కి తీసుకొచ్చారు. దీంతో థియేటర్లలో ఉండగానే ఓటీటీలో విడుదల కావడంతో నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications