కోటి రూపాయిలు తీసుకున్న తొలి తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..?
హీరోలకు ఉన్నంత డిమాండ్, పారితోషకం రెండూ కూడా హీరోయిన్లకు ఉండవనే విషయం తెలిసిందే. చిరంజీవితో హీరోయిన్లుగా నటించిన చాలామంది,ఇప్పుడు అమ్మ క్యారెక్టర్లలో నటిస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఇంకా సినిమాల్లో హీరోగానే నటిస్తున్నారు. అలాగే హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యూనిరేషన్ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ మధ్య హీరోయిన్లు కూడా కోట్ల రూపాయిలలో పారితోషకం అందుకుంటున్నారు.
అయితే తెలుగులో కోటీ రూపాయిలు తీసుకున్న తొలి తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..?. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు గోవా బ్యూటీ ఇలియానా.ఇప్పుడైతే రోజుకో హీరోయిన్ టాప్ ప్లేస్‌లో ఉంటున్నారు కానీ, ఒకనొక సమయంలో ఇలియానా దశాబ్ద కాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. రామ్ హీరోగా నటించిన ''దేవదాసు'' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా, అనతి కాలంలోనే స్టార్ హీరయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రెండో సినిమానే మహేష్ బాబు వంటి సూపర్ స్టార్‌తో నటించే అవకాశం దక్కించుకుంది. ''పోకిరి'' సినిమాతో ఇలియానా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, ప్రభాస్ , అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. ఇలియానా పేరు చెప్పగానే అందరికీ ఆమె నడుమే గుర్తుకు వస్తుంది. ఎవరినైనా పొగిడే సమయంలో అచ్చం నీ నడుము ఇలియానాలా ఉంది అని అంటూ ఉంటారు.అంత ఫేమస్ అయింది ఇలియానా నడుము. కోటి రూపాయిలు పారితోషకం అందుకున్న తొలి హీరోయిన్‌గా ఇలియానా చరిత్ర సృష్టించింది. అంతలా ఆమె క్రేజ్ ఉండేది.












Click it and Unblock the Notifications