చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమాలో కీలక పాత్ర చేస్తున్నా

సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ నటుడు చిట్టి (చందన లక్ష్మీ నరసింహారావు) తన అనుభవాలను పంచుకున్నారు. సినీ పరిశ్రమకు తాను ఎంతో రుణపడి ఉన్నానని, ప్రజలు తనను "చిట్టి" అని పిలవడంతో అదే తన తెర పేరుగా మారిందని, అయితే తల్లిదండ్రులు పెట్టిన పేరు చందన లక్ష్మీ నరసింహారావు అని ఆయన తెలిపారు.

మద్రాసు నుండి హైదరాబాద్‌కు సినీ పరిశ్రమ మారినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది దర్శకులతో కలిసి పని చేసినట్లు చిట్టి గుర్తు చేసుకున్నారు. తన పాత్రలను రాసిన రచయితలకు, అవకాశం ఇచ్చిన దర్శకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమలోని అగ్ర హీరోలందరితో కలిసి తెరను పంచుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

doing a good role in Chiranjeevi - Anil Ravipudi movie

చిట్టి తన సుదీర్ఘ కెరీర్‌లో 5 సినిమాల్లో హీరోగా, 170 సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా నటించి, ఎన్నో అవార్డులు, ప్రశంసలు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆయన నటించిన చిత్రాలలో పచ్చని సంసారం, రౌడీ అన్నయ్య, మాస్టర్, గౌతమ్ SSC, ఠాగూర్, రణం, ఇష్క్, పోకిరి, క్రాక్, లెజెండ్, అఖండ, సరిలేరు నీకెవ్వరూ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం వంటి ఎన్నో సినిమాలు విజయవంతం అయ్యాయి.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో తాను ఒక మంచి పాత్రలో నటించానని చిట్టి తెలిపారు. కొత్తతరం సినీ పరిశ్రమలోకి రావాలని, కొత్త ఆలోచనలు, కథలతో సినిమాలు రూపొందాలని, తద్వారా పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త, పాత దర్శకులకు తమ వంటి సీనియర్ నటుల మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. తనకు అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, దర్శకులకు, హీరోలకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిట్టి వంటి సీనియర్ నటులు పరిశ్రమకు అందించిన సేవలు, వారి అనుభవం కొత్త తరానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+