మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!!
గతేడాది 'లిటిల్ హార్ట్స్' మూవీ ప్రేక్షకుల్ని ఎంతలా అలరించిందో మనందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. అంతకు ముందు #90s తో ఎంట్రీ ఇచ్చాడు లిటిల్ హార్ట్స్ హీరో మౌళి. ఆ వెబ్ సిరీస్ తోనూ హిట్ కొట్టాడు మౌళి. ఆ తర్వాత వచ్చిన లిటిల్ హార్ట్స్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దాంతో మౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు మౌళి. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఇక టాలీవుడ్ యంగ్ హీరో మౌళి కొత్త సినిమా టైటిల్ వింటే మీరు షాక్ అవుతారు. ఈ మూవీకి 'దొంగ నా కొడుకు' అనే టైటిల్ పెట్టినట్లు స్పష్టం అవుతోంది. టైటిల్ ను బట్టి చూస్తే ఈ మూవీ పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని అర్థం అవుతోంది. మౌళి శైలికి తగ్గట్టుగానే ఈ మూవీ ఉంటుందని సమాచారం. ఇక ఈ మూవీ టైటిల్ క్షణాల్లో వైరల్ కావడంతో సినిమాపై బజ్ అప్పుడే ఏర్పడింది. ఇక ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

మైత్రి మూవీస్ అంటేనే పెద్ద పెద్ద చిత్రాలకు పెట్టింది పేరు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, పుష్ప లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ చిన్న సినిమాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇక మౌళి దొంగనా కొడుకు మూవీ ఈ ఏడాదిలో విడుదలవుతుందా..? లేదంటే వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుందా..? వేచి చూడాలి. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.












Click it and Unblock the Notifications