చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' దుబాయి ప్రీమియర్ షో టాక్ ఇదే..!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కి మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీ సరసన లైడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా కావడి విశేషం. ఇది వరకు సైరా నరసింహ రెడ్డి, గాడ్ ఫాదర్ లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మరోసారి ఈ ఇద్దరు నటించనుండడంతో అంచనాలు పెరిగాయి.
ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. గతేడాది వెంకటేశ్ తో సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో పెద్ద విజయం అందుకున్నారు. ఈ సారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జనవరి 11 న రాత్రి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. అయితే ఇప్పటికే దుబాయి లో ప్రీమియర్ షో పూర్తయింది. అక్కడి నుంచి వస్తున్న రివ్యూ ప్రకారం..
దుబాయి ప్రీమియర్ షో నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. ట్రైలర్ చూపించినట్లుగానే ఈ మూవీ రొటీన్ కమర్షియల్ సినిమా మాదిరిగానే ఉందట. ఫస్ట్ హాఫ్ మొత్తం వింటేజ్ చిరంజీవి కనిపిస్తారట. చిరంజీవి తన కామెడీ టైమింగ్, నయనతార తో సీన్స్ తో డైరెక్టర్ అనిల్ రావిపూడి లాగించేశాడట. స్టోరీపై పెద్దగా దృష్టి పెట్టలేదని టాక్ వినిపిస్తోంది. అయితే ఫస్ట హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చుతుందని తెలుస్తోంది.

ఇక సెకండాఫ్ స్టార్టింగ్ లో సినిమా కాస్త నెమ్మదిస్తుందని టాక్ వినిపిస్తోంది. అయితే విక్టరీ వెంకటేశ్ ఎంట్రీతో మూవీ వేరే ట్రాక్ లోకి మారుతుందని టాక్. మొత్తానికి అనిల్ మార్క్ కామెడీ, చిరంజీవి కామెడీ టైమింగ్ తో పాటు అక్కడక్కడా ఎమోషన్స్ కూడా బాగా వర్కవుట్ అయినట్లు తెలుస్తోంది. ఇక సాంగ్స్ కూడా మూవీకి బాగా హెల్ప్ అయినట్లు తెలుస్తోంది. హుక్ స్టెప్ తొలి సాంగ్ కావడంతో ఫ్యాన్స్ కు మంచి జోష్ ను ఇస్తుందని టాక్. మరి పూర్తి రివ్యూ కావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఇక ఈ మూవీకి భీమ్స్ మ్యూజిక్ అందించారు.












Click it and Unblock the Notifications