ఓటీటీలో రెండేళ్లుగా ట్రెండింగ్.. ప్రభాస్ హీరోయిన్ సినిమా ఏదో తెలుసా..?
చాలా సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీల్లో మాత్రం అలరిస్తుంటాయి. రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తుంటాయి. చాలా వరకు పెద్ద సినిమాలకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. మూవీ రిలీజ్ కు మందు ఫ్యాన్స్ అంచనాలు ఆగతాన్ని తాకుతాయి. దాంతో థియేటర్లలో రిలీజైన సినిమా ఆ అంచనాలను అందుకోలేక పోతే యావరేజ్, ప్లాఫ్ అని ముద్ర వేస్తారు ఫ్యాన్స్. స్టోరీలో కంటెంట్ ఉన్నా అంచనాల నేపథ్యంలో ఆ సమయంలో చాలా సినిమాలను ఫ్యాన్స్ రిజెక్ట్ చేస్తుంటారు. కానీ అవే మూవీస్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయితే మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటాయి. రికార్డు వ్యూస్ సాధిస్తాయి. అయితే ఓ బాలీవుడ్ సినిమా థియేటర్లలో అంతగా పర్మామ్ చేయనప్పటికీ ఓటీటీల్లో మాత్రం రెండేళ్లుగా ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మరి ఆ మూవీ ఏంటి..?
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. దిగ్గజ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్ లో వచ్చిన 'డంకీ' మూవీ డిసెంబర్ 21, 2023న విడుదలైంది. అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ మూవీ రిలీజైంది. దాంతో ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా నిరాశపరిచింది. ఇదే సమయంలో సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. డంకీ మూవీ రూ.120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్ల వరకు రాబట్టింది. ఈ సినిమాలో అక్రమ వలసల వల్ల సామాన్యులు పడే ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ.

అయితే ఈ చిత్రం ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. హిందీతో పాటుగా తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇక ఈ మూవీలో షారుఖ్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ లాంటి పెద్ద స్టార్లు నటించారు. తాప్సీ పన్ను తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఝమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రభాస్ తో మిస్టర్ ఫర్ ఫెక్ట్ సినిమా చేసింది.












Click it and Unblock the Notifications