'దేవర'ను కాపాడింది ఎన్టీఆర్ ,కొరటాల కాదు..అతనే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సింగిల్ హీరోగా కనిపించిన సినిమా 'దేవర'. గురువారం అర్థరాత్రి నుంచే 'దేవర' షోలు ప్రారంభం కావడంతో థియేటర్ల దగ్గర ఎన్టీఆర్ అభిమానులు సందడి కనిపించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులు 'దేవర'పై పెదవి విరుస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సూపర్‌గా ఉందని చెబుతోన్న అభిమానులు, సెకాండాఫ్‌కు వచ్చే సరికి నీరసం వచ్చేసిందని చెబుతున్నారు.ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచినట్టుగా తెలుస్తోంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ సైతం బాగుందని చెబుతున్నారు. కానీ సెకండాఫ్‌లోనే సినిమా గాడి తప్పిందని ప్రేక్షకులు చెబుతున్నారు. సెకండాఫ్‌లో కథ తేలిపోయిందని, ముఖ్యంగా జాన్వీ కపూర్‌తో వచ్చే సీన్స్ బోర్ కొట్టించాయని సినిమా చూసిని ప్రేక్షకులు చెబుతున్నారు.

సినిమాలో జాన్వీ కపూర్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని,కేవలం పాటలకే పరిమితం అయిందని తెలుస్తోంది.ఇక విలన్‌గా నటించిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆకట్టుకోలేకపోయారని, ఆయనకు డబ్బింగ్ సెట్ కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. లిప్‌ సింక్ కాలేదని చెబుతున్నారు. అనిరుథ్ సైతం ఆకట్టుకోలేకపోయారని సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. వచ్చే సీన్లకు ఆయనిచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కు ఏమాత్రం సంబంధం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక కొరటాల విషయానికి వచ్చే సరికి ఫస్ట్ హాఫ్ బాగానే హ్యాండిల్ చేసినప్పటికీ, సెకండాఫ్‌లో కథను డీల్ చేయడంలో కొరటాల తడపడ్డారని తెలుస్తోంది. సినిమాను ఓ పార్ట్‌గా తెరకెక్కిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Editor Sreekar Prasad editing is a big asset of the movie Devara

రెండో పార్ట్ కోసం సెకండాఫ్‌ను సాగదీసినట్టుగా అనిపిస్తోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపమే చూపించారని అభిమానులు చెబుతున్నారు. డ్యాన్స్‌లు , ఫైట్స్‌తో ఎన్టీఆర్ అదరగొట్టారని అభిమానులు పేర్కొంటున్నారు. అయితే సినిమాను మాత్రం కాపాడింది ఎడిటర్ అని అంటున్నారు. ఎడిటర్‌గా పని చేసిన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా మారిందని రివ్యూస్ అభివర్ణిస్తున్నాయి. ఎటువంటి కనిఫ్యూజన్‌కు తావు లేకుండా సినిమాను ఎడిటింగ్ చేయడంలో శ్రీకర్ ప్రసాద్‌ది కీలక పాత్ర అంటున్నారు. సీన్ టూ సీన్‌తో సినిమాను ముందుకు తీసుకువెళ్లడంలో ఎడిటర్‌గా పని చేసిన శ్రీకర్ ప్రసాద్ కష్టం కనిపిస్తోందని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Editor Sreekar Prasad editing is a big asset of the movie Devara

ఇక బాక్సాఫీస్ వద్ద 'దేవర' మొదటి రోజు కుమ్మేసింది. మొదటి రోజు దేవరకు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అఫిషియల్‌గా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇండియాలో అన్ని భాషలలో కలిపి దాదాపు రూ.77 కోట్లు నెట్​ అందుకున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూలు చేసింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిన్న ఒక్కరోజే రూ.68.6 కోట్లు కలెక్షన్స్ వచ్చాయట. ఇతర భాషలలో హిందీలో రూ.7 కోట్లు, కన్నడలో రూ.0.3 కోట్లు, తమిళంలో రూ.0.8 కోట్లు, మలయాళంలో రూ.0.3 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+