మాజీ మంత్రి ముందే ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన జంట.. వీడియో వైరల్ !!

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఛానెళ్లు వినూత్నమైన థీమ్‌లతో సరికొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే కామెడీ, వంటలు, డాన్స్ వంటి అన్ని విభాగాల్లోనూ కొత్త తరహా కంటెంట్‌తో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే జీ తెలుగు ఛానెల్ తాజాగా ఒక కొత్త షోను ప్రారంభించింది. సీనియర్ నటి, మాజీ మంత్రి ఆర్.కె. రోజా వ్యవహరించనున్నారు. ఈ వేసవిలో కుటుంబ ప్రేక్షకులను, యువతను లక్ష్యంగా చేసుకుని.. సీరియల్ స్టార్స్ తో పాటు సినిమా స్టార్స్ కూడా ఈ షోలో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే రోజా 'జబర్దస్త్' వంటి షో ద్వారా ఆమె సినిమాల్లో సంపాదించిన క్రేజ్ కంటే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆమె వేసిన పంచ్‌లు, జోక్స్ ఆ షో విజయానికి ముఖ్య కారణమయ్యాయి. అయితే 2024 ఎన్నికల ఓటమి తర్వాత రాజకీయ, వెండితెర, బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు మళ్ళీ యాక్టివ్‌గా మారారు. ఈ నేపథ్యంలోనే జీ తెలుగులో త్వరలో ప్రసారం కానున్న 'ది ఫ్యామిలీ అసెంబ్లీ' షో పై హాట్ బాజ్ నెలకొంది.

ex-minister-roja-hosting-the-family-assembly-show-promo-goes-viral-with-new-couple-hugs-and-kisses

ఇక ఈ షో ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభం కానుండగా.. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. రోజాతో పాటు సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, కథానాయిక ఫరియా అబ్దుల్లా, గాయని సమీరా భరద్వాజ్ వంటి బుల్లితెర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను జీ తెలుగు ఇటీవల విడుదల చేసింది. అయితే లాంచింగ్ ఎపిసోడ్‌లో భాగంగా త్వరలో ప్రసారం కానున్న 'మేఘ సందేశం' సీరియల్‌లోని గగన్ (అభినవ్), భూమి (భూమిక) కార్యక్రమంలో సందడి చేశారు.

ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ అవుతుండగా.. భూమి, గగన్ టాక్ ఆఫ్ ది షో గా మారిపోయారు. మరి ముఖ్యంగా గగన్.. భూమి చేతిని ముద్దాడి, బుగ్గ నిమురుతూ రొమాన్స్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇక నేను కూడా తగ్గేదే లే అంటూ భూమి కూడా దుప్పటి తీసుకొని రెచ్చిపోవడం చూసి అక్కడున్న కంటెస్టెంట్లు సైతం ఆశ్చర్యపోయారు. అందుకు తగ్గట్టే రోజా, 'అసలు ఈ పిల్లాడు ఏం చేశాడు?' అని ప్రశ్నించగా.. సమీరా 'అల్లాడిపోయాడు' అంటూ సరదా కామెంట్స్ చేసింది.

అంతే కాకుండా 'మా ఇద్దరికీ పెళ్లి చేపిస్తారా?' అని భూమి అడగ్గా, 'పెళ్లికి ముందే అన్ని చేశాక, ఇప్పుడు పెళ్లి దేనికి?' అంటూ రోజా ఘాటుగా బదులిచ్చారు. 'కుడికాలు ముందు పెట్టే ముందు ఎవరితో వచ్చావో చెప్పండి' అని రోజా అడగ్గా, గగన్, భూమి సిగ్గుపడతారు. దీనికి రోజా, 'సిగ్గుపడాల్సినవన్నీ చేసేసి, ఇప్పుడు సిగ్గుపడితే ఏం బాగుంటుంది?' అంటూ జోక్ చేశారు. దీంతో మాజీ మంత్రి ముందే కొత్త జంట చెలరేగుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+