అన్నా నీ సినిమాకు టీ ఖర్చులు కూడా రాలేదు..!

ఇటీవలి కాలంలో థియేటర్లలో ఏ సినిమా హిట్ అవుతుంది. ఏ సినిమా ఫట్ అవుతుంది అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. సైలెంట్ గా వచ్చిన చిన్న సినిమాలు హిట్ అవుతుండగా భారీ అంచనాలతో వచ్చిన పెద్ద సినిమాలు ప్లాఫ్ అవుతున్నాయి. అలాగే సరైన కంటెంట్ లేకుండా వచ్చిన ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోతుంది. అయితే తెలుగులో వినూత్నమైన కాన్సెప్ట్ తో ఇటీవల విడుదలైన మూవీ 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' ఈ మూవీలో మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించారు. పుష్ప సిరీస్ తో తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో ఫహద్ ఫాజిల్. అయితే ఈ మూవీ ఆయనకు స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడం విశేషం.

ఇక టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, ఎస్‌ ఎస్‌ కార్తికేయ నిర్మించారు. ఈ మూవీతోనే రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాతగా మారడం విశేషం. అలాగే డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాలుపంచుకున్నాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ లు తమ ఇన్ స్టా గ్రామ్ లో పోస్టులు పెట్టి ప్రొమోషన్స్ చేశారు. దాంతో రిలీజ్ కు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

FahadhFaasil Don t Trouble the Trouble dismal box office collections the situation after 5 days

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ మూవీలో సారా పలేకర్‌, మహేష్‌ మంజ్రేకర్‌, సుబ్బరాజు వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. ఈ మూవీ గాంధీ జయంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ప్రారంభం నుంచే నెగిటివ్‌ టాక్‌ ను మూటగట్టుకుంది. దెయ్యాన్ని కిడ్నాప్ చేయడం అనే కొత్త కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కినా ఈ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించడంలో ఎక్కడో విఫలం అయింది. దాంతో ఈ మూవీకి ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. చిన్నపిల్లలకు ఈ మూవీ బాగా నచ్చుతుందని చిత్ర యూనిట్ భావించినా అది కూడా బెడిసికొట్టింది. దాంతో ఈ సినిమాకు దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. ఈ మూవీకి టోటల్ గా ఐదు రోజుల్లో రూ.3.71 కోట్ల నెట్‌ వచ్చింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.4.27కోట్ల గ్రాస్‌ ను సాధించింది. ఫస్ట్ రెండు రోజులు వీకెండ్ లో పర్వాలేదనిపించినా ఆ తర్వాత దారుణంగా పడిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+