Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐదేళ్లు డేటింగ్ చేసి డేర్ గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్, 35 ఏళ్లు ఇండస్ట్రీలో క్వీన్ !

నటి ఖుష్పూ 35 ఏళ్లకు పైగా తమిళ చిత్రసీమలో అగ్రనటిగా హవా సాగించింది. సినిమాల్లో చాలా బిజీగా ఉంటున్న సమయంలోనే నటి ఖుష్బూ ప్రముఖ దర్శకుడు సుందర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ సుందర్, ఖుష్బూ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఖుష్బు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆమె భర్తతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేసింది. తమిళ సినిమా స్టార్ కపుల్ అయిన ఈ జంటకు చాల కథ ఉంది.

ఖుష్బూ నటిగానే కాకుండా నిర్మాతగా బుల్లితెర నటిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నది. పలు రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. రాజకీయాల్లో కూడా రాణిస్తున్న ఖుష్బూ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా పని చేస్తున్నారు. అంతే కాకుండా ఖుష్బూ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో చాలా చురుకుగా ఉంటున్నది. ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఖుష్బూ మంచి డైట్, వర్కవుట్‌లతో స్లిమ్ అయింది.

Famous actress Khushboo remembered that it has been 29 years with her husband Sundar

90వ దశకంలో ఖుష్బూ ప్రముఖ హీరోలు అందరితో నటించి బాగా పాపులర్ అయ్యారు. ఖుష్బూ ఆమె అభిమానులకు ఆరాధ్యదేవత అయ్యారు. చాలా మంది అభిమానులు ఖుష్బూకు గుడి కట్టారు అంటే ఆమె ఎంత పాపులర్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఇడ్లీకి కూడా కుష్బూ ఇడ్లీ అని పేరు పెట్టడంపై అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. తన డేరింగ్ పర్ఫార్మెన్స్‌తో అభిమానులను కట్టిపడేసిన ఖుష్బూ. రజనీకాంత్, కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున, రాజేంద్రప్రసాద్, సత్యరాజ్, శరత్‌కుమార్ తదితర హీరోలతో జోడీ కట్టారు.

తమిళ సినిమాలో జంటగా నటించని నటీనటులు లేరనే స్థాయిలో అందరితోనూ ఖుష్బూ నటించింది. తరువాత ఖుష్బూ ప్రేమలో పడిపోయింది. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి తో కలిసి ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలలో నటించిన ఖుష్బూ ఆయన ప్రేమలో పడిపోయింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఖుష్బూ, సుందర్ కలిసి ఐదేళ్లపాటు డేటింగ్ చేసి ఆ తర్వాత 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Famous actress Khushboo remembered that it has been 29 years with her husband Sundar

ఖుష్బూ ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు పెద్దవాళ్ళు కావడంతో ఒకరు నటనపై, మరొకరు నిర్మాణంపై దృష్టి సారిస్తున్నారు. వీరి ప్రేమ చిగురించి 29 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంలో సుందర్ సి తన ప్రేమను వ్యక్తం చేసిన రోజు గురించి నటి ఖుష్బూ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సంతోషంగా పంచుకున్నారు. అందులో 22 ఫిబ్రవరి 1995 నుండి 22 ఫిబ్రవరి 2024 వరకు మనలో ఏమీ మార్పులు రాలేదు, మనం మారలేదు అని రాసుకుంది.

మన ప్లస్‌లు, మైనస్‌లన్నింటినీ అంగీకరిస్తూ ప్రేమ, ఒకరికి ఒకరు అర్థం చేసుకుని పరస్పరం మద్దతు తెలుపుకోవడంతో ఇన్నేళ్లూ గడిచిపోయాయని ఖుష్బూ వివరించారు. ఇదే మా కుటుంబాన్ని అందంగా ఉండేలా చేసింది, మీరు నాతో మీ ప్రేమను వ్యక్తపరిచిన రోజులు గుర్తుకు వచ్చాయి, మీ ప్రేమను నేను అంగీకరించి 29 సంవత్సరాలు గడిచాయి. నా నిర్ణయం సరైనదని ఇప్పటి వరకు మీరు నిరూపించారు. 29 ఏళ్ల మారని ప్రేమ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆశిస్తున్నానని ఖుష్బూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఖుష్బు, సుందర్ జంట కలిసి 29 ఏళ్ల గడిచిపోయిందని తెలుసుకున్న వారి అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+