మరో మెగా జంట విడిపోవడం ఖాయం
తెలంగాణ ఎన్నికల ఫలితాల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎంతలా ట్రెండింగ్‌లోకి వచ్చారో అంతేస్థాయిలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మరోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని వేణు స్వామి పలు సందర్భాల్లో తెలిపారు. కాని ఆయన చెప్పిన దానికి పూర్తి విరుద్దంగా ఫలితాలు వెలువడ్డాయి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆయన్ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో పలువురు విమర్శలకు దిగారు. తాజాగా ఆయన మరోమారు బాంబు పేల్చారు. గతంలో నాగ చైతన్య- సమంత విడిపోతారని ముందే చెప్పిన వేణు స్వామి.. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఓ జంట విడిపోతారని చెప్పి సంచలనం సృష్టించారు.

తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న వేణు స్వామి మెగా హీరో వరుణ్ తేజ్ - లావణ్య తిపాఠిలు విడిపోతారని చెప్పారు. వీరి జాతకంలో గురువు , శుక్రుడు నీచంగా ఉన్నాయని..నాకు తెలిసి వాళ్లు కలిసి ఉండలేరని వేణు స్వామి చెప్పుకొచ్చారు. లావణ్య త్రిపాఠికి కుజ దోషం ఉంది..అలాగే వరుణ్ తేజ్‌కు నాగ దోషం ఉంది.. దీంతో వీరు కలిసి ఉండే అవకాశం లేదని ఆయన తెలిపారు.

వరుణ్ తేజ్ - లావణ్య తిపాఠిల విషయంలో తాను చెప్పిన మాటలు నిజం అవుతాయంటూ వేణు స్వామి కుండబద్దలు కొట్టేస్తున్నారట. వరుణ్ తేజ్ - లావణ్య తిపాఠి విడిపోతారని చెప్పడంతో వేణు స్వామిపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి చెప్పే హక్కు వేణు స్వామికి ఎక్కడుదంటూ వారు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications