బిగ్ షాక్.. బ్రహ్మ కుమారీగా మారిన ప్రముఖ హీరోయిన్ !
చిత్రపరిశ్రమలో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి.. గత దశాబ్ద కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక రంగం వైపు అడుగులు వేసిన ఆమె.. ఇప్పుడు ఏకంగా బ్రహ్మ కుమారీగా మారిపోయారు. దీంతో ఆ అనూహ్య నిర్ణయం తీసుకున్న నటి ఎవరు ? ఆ స్టోరీ ఏంటి అని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
ఇంతకీ ఆ నటి ఎవరో కాదు.. ప్రముఖ నటి గ్రేసీ సింగ్. 2001 లో వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం లగాన్ లో ఆమిర్ ఖాన్ సరసన నటించి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఆమె మున్నాభాయ్ ఎంబిబిఎస్ లో సంజయ్ దత్ కి జోడీగా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తెలుగు సినిమాల్లోనూ ఆమె మంచి పేరు సంపాదించింది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున సరసన నటించిన సంతోషం చిత్రం ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది.

తెలుగులో క్రేజ్...
సంతోషం తర్వాత తెలుగులో తప్పుచేసి పప్పుకూడు, రామ రామకృష్ణ కృష్ణ, రామ్ దేవ్ వంటి చిత్రాల్లో నటించింది. మోహన్ బాబు, శ్రీకాంత్, అబ్బాస్, ఆకాష్, అర్జున్ వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసింది. తెలుగు, హిందీ, దక్షిణాది భాషలతో పాటు పంజాబీ చిత్రాలలోనూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ బ్రహ్మ కుమారి జీవనశైలిని స్వీకరించింది. చిత్రరంగంలో బిజీ కెరీర్ తర్వాత, గ్రేసీ సింగ్ ఒక్కసారిగా సినిమాలకు దూరమైంది. ఆత్మశాంతి కోసం ఆమె బ్రహ్మ కుమారీస్ సంస్థలో చేరింది.
నర్తనలో శిక్షణ...
ప్రస్తుతం ఆమె ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటోంది. ధ్యానం, సేవ, యోగా వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ, నాట్యం ద్వారా ఆధ్యాత్మిక సందేశాలు అందిస్తోంది. అంతే కాకుండా గ్రేసీ సింగ్ కేవలం నటి మాత్రమే కాదు. ఆమె శిక్షణ పొందిన భరతనాట్యం, ఒడిస్సీ నృత్యకారిణి కూడా. ఈ నృత్య శైలులను ప్రదర్శిస్తూ పలు రంగస్థలాలపై మెరిసింది. ఈ నైపుణ్యాన్ని తర్వాత ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలోనూ వినియోగిస్తోంది. అయితే గ్రేసీ సింగ్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు తన జీవితాన్ని ఆధ్యాత్మికతకే అంకితం చేయాలని నిర్ణయించుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications