"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్
ఇటీవలికాలంలో సెలబ్రిటీ కపుల్స్ విడాకులు సర్వ సాధారణం అయిపోయింది. కారణాలు ఏమైనా అనేకమంది హీరో, హీరోయిన్లు తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నారు. ఇది ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. తమిళం, మలయాళం, కన్నడ, బాలీవుడ్ ఇలా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ కనిపిస్తోంది. అయితే మలయాళీ ముద్దుగుమ్మ గౌరీ కృష్ణన్ పలు సినిమాలు, సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె షాకింగ్ వీడియో పోస్ట్ చేశారు.
తన వైవాహిక జీవితం ముగిసిందని తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియో పెట్టింది గౌరీ కృష్ణన్. ఈ మేరకు తన వ్యక్తిగత జీవితం కీలక విషయాలను బయటపెట్టింది. " నాకు ఓ భాగస్వామి కావాలని నేను ఎప్పుడూ కోరుకుంటూనే ఉన్నాను. కానీ అవతలి వ్యక్తి కూడా అదే ఫీల్ అవ్వాలి కదా. నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నేను అతనికి మంచి భాగస్వామిగా ఉండలేకపోయాను. నిన్నకాక మొన్న వచ్చిన వ్యక్తితో నేను నా లైఫ్ స్టైల్ ను మార్చుకుని సర్దుకుని జీవించడం నా వల్ల కాదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం చెప్పిందంటే.. ఎవరినీ బాధపెట్టకుండా వాళ్లకు దూరంగా ఉండమని.. ప్రేమ అనేది సహజంగా రావాలి.. అది ఫోర్స్ చేస్తే వచ్చేది కాదు.." అని మలయాళీ బ్యూటీ గౌరీ కృష్ణన్ తెలిపారు.

నేను పబ్లిక్ లో షో కోసం పెళ్లి చేసుకోలేదు. నాకు ఓ భాగస్వామి కావాలని పెళ్లి చేసుకున్నా.. కానీ నాకు అది జరగలేదు. ఇప్పుడు నా లైఫ్ లో క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను. త్వరలోనే మళ్లీ యాక్టింగ్ పై దృష్టి పెడతాను.. అని గౌరీ కృష్ణన్ చెప్పుకొచ్చారు. ఇక దర్శకుడు మనోజ్ పేయాద్ ను గౌరీ కృష్ణన్ 2022 లో వివాహం చేసుకున్నారు. హిట్ సీరియల్ అయిన పౌర్ణమితింగల్ కు మనోజ్ దర్శకత్వం వహించారు. అయితే పెళ్లి తర్వాత గౌరీ కృష్ణన్ ఒక్కసారిగా సోషల్ మీడియాకు దూరం కావడం సంచలనం రేపింది. అప్పటివరకూ ఫుల్ యాక్టివ్ గా ఉన్న నటి.. వివాహం తర్వాత పలు కారణాలతో 6 నెలలు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications