Gunde Ninda Gudi Gantalu : సెప్టెంబర్ 23 ఎపిసోడ్.. చింటూకి యాక్సిడెంట్.. బాలు మీనాకు రోహిణి దొరికిపోతుందా ??

ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న "గుండెనిండా గుడిగంటలు" సీరియల్.. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాగా నేడు ( సెప్టెంబర్ 23వ తేదీ, 2025 ) ప్రసారం కానున్న 516వ ఎపిసోడ్ కూడా ఆసక్తికర సన్నివేశాలతో పాటు అనూహ్య మలుపులతో ఆకట్టుకుంది. మీనాతో ప్రభావతి దురుసుగా ప్రవర్తించడం, బాలు-మనోజ్ మధ్య ఘర్షణ.. చింటూ యాక్సిడెంట్ వంటి సంఘటనలు ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తించాయి.

మీనాకు ప్రభావతి అవమానం..

జ్వరంతో రోహిణి గదిలో విశ్రాంతి తీసుకుంటున్న మీనాని ప్రభావతి పట్టుబట్టి బయటకు లాక్కొచ్చింది. "జ్వరమొచ్చిందని ఏసీ గది కావాలా? పూలమ్ముకునేదానికి ఇంత సౌకర్యమా?" అంటూ ఆమెను అవమానించింది. మీనా ఆరోగ్యం బాగోలేదని చెప్పినా పట్టించుకోలేదు. ఆ క్షణంలో బాలు అక్కడికి చేరుకోవడంతో ప్రభావతి, రోహిణి షాక్ అయ్యారు. సత్యం కూడా వచ్చి ప్రభావతిని మందలించాడు.

gunde-ninda-gudi-gantalu-september-23rd-episode-details

బాలు ఆగ్రహం - మనోజ్‌కి ఎదురు ప్రశ్నలు

తన భార్యను ఇలా అవమానించారని కోపంగా ఉన్న బాలు, మనోజ్‌ను పట్టుకుని "ఎలా లాక్కొచ్చిందో తెలుసా?" అంటూ ఆగ్రహంతో లాగాడు. రోహిణి వెంటనే మాట మార్చి టాపిక్‌ని శ్రుతి వైపు మళ్లించింది. దాంతో మీనాకు గది కేటాయింపుపై కొత్త వాదన మొదలైంది. రోహిణి మాట్లాడుతూ, "వచ్చే వారం మీనాకి గది ఇచ్చేస్తారు. నేను రవిని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను" అని చెప్పడంతో ప్రభావతి షాక్ అయ్యింది. రవి కూడా ఇదే విషయం తాను ఇప్పుడే విన్నానని అన్నాడు. ఈ వివాదానికి తెరదించడానికి సత్యం ఒక పరిష్కారం సూచించాడు: "నేను, మనోజ్, బాలు ఒక గదిలో పడుకుంటాం. నువ్వు, మీనా, రోహిణి మరో గదిలో పడుకోండి." అని చెప్తాడు.

ఇక గదిలో పడుకునే సమయంలో బాలు-మనోజ్ మధ్య చిలిపి మాటలు సాగాయి. మనోజ్ "నువ్వు నా పక్కన పడుకుంటావా?" అని అడగగా, బాలు సరదాగా కింద చాప వేసుకుని పడతానని అన్నాడు. తర్వాత మనోజ్ కథల పేరుతో డబ్బులు కొట్టేసిన తన అనుభవాన్ని చెప్పగా, బాలు అతడిని ఆట పట్టించాడు. మరోవైపు రోహిణి, ప్రభావతి గురకలు, సెటైర్లు కొనసాగాయి. మీనా మాత్రం అన్ని అవమానాల్ని భరిస్తూ నేలమీద పడుకుంది.

వంటపై ఘర్షణ..

ఉదయం ప్రభావతి మీనాపై మళ్లీ నిందలు వేసింది. "ఇంతవరకు వంట చేయలేదేంటి?" అని అడగగా, మీనా "ఒక్కరోజు వాళ్ళు చేసుకోలేరా?" అని సమాధానం చెప్పింది. దీంతో మరింత ఘర్షణ పెరిగింది. చివరకు బాలు ముందుకొచ్చి మీనాకు స్వయంగా జావ చేసి ఇచ్చాడు. ఇది చూసిన అందరూ ఆశ్చర్యపోయారు.

చింటూ యాక్సిడెంట్..

బాలు, మీనా ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న సమయంలో చింటూ గాయాలతో అక్కడికి తీసుకురావడాన్ని చూసి షాక్ అయ్యారు. చింటూ అమ్మమ్మ (సుగుణమ్మ) కన్నీళ్లతో ప్రమాదం జరిగినట్లు వివరించింది. డాక్టర్ సర్జరీ అవసరమని చెప్పడంతో, బాలు-మీనాలు ఆమెకు ధైర్యం చెప్పారు. కానీ, చింటూ, రోహిణి మధ్య ఉన్న అనుమానాస్పద బంధంపై వారికి కొత్త సందేహాలు వచ్చాయి. ఇక సుగుణమ్మ రోహిణికి ఫోన్ చేసి "నీ కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడు" అని చెబుతుంది. చింటూ గురించి విన్న రోహిణి కంగారు పడుతూ వెంటనే రావాలని చెబుతుంది. బాలు, మీనా ఆసుపత్రిలో ఉన్నారని తెలిసినా, తల్లిప్రేమతో రోహిణి వారిని పట్టించుకోకుండా అక్కడికి చేరుతుంది. వారిని చూసి షాక్ అవుతుంది.

బాలు అనుమానం..

రోహిణి ప్రవర్తనతో బాలు మరింత అనుమానం పెంచుకుంటాడు. "చింటూకి పార్లర్ అమ్మకి ఏదో లింక్ ఉంది. అదేంటో మనం కనిపెట్టాలి" అని మీనాతో గట్టిగా చెబుతాడు. మరి బాలు రోహిణి అసలు పేరు కళ్యాణి అని, ఆమెకు పెళ్లై భర్త చనిపోయాడని, చింటూ ఆమె కొడుకని, సుగుణమ్మ ఆమె తల్లి అని తెలుసుకుంటాడా రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అని ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+