Guntur Kaaram: వీడియో: ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం 70 ఎంఎం స్క్రీన్: అవే హైలైట్స్

Guntur kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ ఇది.

హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ.. ఇతర కీలక పాత్రలను పోషించారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మాస్ మసాలా మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

Guntur Kaaram pre release event: arrangement were gear up at Guntur

రెండు రోజుల కిందటే విడుదల అయిన గుంటూరు కారం ట్రైలర్‌ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మహేష్ బాబులోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిందా ట్రైలర్. సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్.. ఇలా అన్నింట్లోనూ వింటేజ్ మహేష్ బాాబు దర్శనం ఇచ్చాడు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. గుంటూరు సమీపంలోని నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద గల భారత్ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న బహిరంగ స్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఆరంభమౌతుంది.

మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జగపతి బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, చినబాబు.. సహా పలువురు నటీనటులు, టెక్నీషియన్లు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బహిరంగ స్థలం కావడం వల్ల ఎంతమంది అభిమానులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+