Guntur Kaaram pre release: ఏపీకి షిఫ్ట్: డబుల్ ఘాటు

Guntur kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీ జనవరి 12వ తేదీన విడుదల కానుంది.

Recommended Video

    Guntur Kaaram Pre Release మహేష్ బాబు కోసం CM Jagan | Guntur Kaaram Trailer | Telugu OneIndia

    ఈ సినిమా ట్రైలర్‌పై నేడు విడుదల కాబోతోంది. ఈ సాయంత్రం 6 గంటల తరువాత హైదరాబాద్ సుదర్శన్ థియేటర్‌లో ట్రైలర్‌ లాంచ్ కానుంది. మూడు నిమిషాలకు పైగా ట్రైలర్ నిడివిని కట్ చేసినట్లు తెలుస్తోంది. అన్ని ప్రధాన క్యారెక్టర్లను ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం, మహేష్ బాబు మాస్ విశ్వరూపాన్ని ప్రదర్శించేలా ట్రైలర్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

    Guntur Kaaram pre release event likely held in Guntur on Jan 9

    ఈ నెల 9వ తేదీన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది సినిమా యూనిట్. హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపాలని సినిమా యూనిట్ తొలుత నిర్ణయించుకున్నప్పటికీ.. ఇది సాధ్య పడేలా కనిపించట్లేదు. హైదరాబాద్‌లో బహిరంగ సభలను నిర్వహించడానికి అనుమతులు ఇవ్వట్లేదని సమాచారం. ఇండోర్‌ కార్యక్రమాలకు పోలీసుల అనుమతి ఉంది.

    ఏప్రిల్ వరకూ ఎలాంటి పబ్లిక్ ఫంక్షన్లను నిర్వహించడానికి పర్మిషన్లను ఇవ్వట్లేదని తెలుస్తోంది. దీనితో- గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏపీకి షిఫ్ట్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. హార్ట్ ఆఫ్ ది ఏపీ స్టేట్‌గా గుర్తింపు పొందిన గుంటూరులో ప్రీ రిలీజ్‌ను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

    మహేష్ బాబు సొంత జిల్లా కావడం, గుంటూరు టైటిల్‌తో సినిమా తెరకెక్కిన నేపథ్యంలో ఇక్కడైతేనే బాగుంటుందని భావిస్తోందట యూనిట్. ప్రస్తుతానికి ఈ ప్లాన్ చర్చల దశలో ఉంది. ప్రీ రిలీజ్ ప్రోగ్రామ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడానికే మొగ్గు చూపుతోంది యూనిట్. ఇండోర్‌ ఫంక్షన్లకు అనుమతి ఉన్నందున ఇక్కడే ఏర్పాటు చేయవచ్చు. లేదంటే రెండో ప్రత్యామ్నాయంగా గుంటూరును సెలెక్ట్ చేసుకుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+