ఆమెది స‌హ‌జ మ‌ర‌ణం కాదు.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన శ్రీ‌దేవి భ‌ర్త‌..

యావ‌త్ భార‌త‌దేశ‌మంతా అతిలోక సుంద‌రిగా పిలుచుకునే శ్రీ‌దేవి అనంత‌లోకాల‌కు వెళ్లిపోయిన సంగ‌తి అందరికి తెలిసిందే. అప్ప‌ట్లో ఆమె మ‌ర‌ణం ఒక సంచ‌ల‌నంగానూ, మిస్ట‌రీగానూ మిగిలిపోయింది. అయితే, ఇప్ప‌డు ఆ మిస్ట‌రీ గురించి సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు బాలీవుడ్ నిర్మాత‌, శ్రీ‌దేవి భ‌ర్త బోని కపూర్. శ్రీ‌దేవిది స‌హ‌జ మ‌ర‌ణంకాద‌ని, ఆమె ప్ర‌మాద‌వ‌శాత్తు చ‌నిపోయిందని అన్నారు బోని క‌పూర్‌. ఇంత‌కీ ఆ మిస్ట‌రీ వెనుక ఉన్న‌సంచ‌ల‌న విష‌యాలేంటో తెలుసుకుందాం..

దుబాయ్‌లో మ‌ర‌ణం : 2018 ఫిబ్ర‌వ‌రిలో స్నేహితుని కుటుంబంలో పెళ్లికి హాజ‌ర‌య్యింది శ్రీ‌దేవి. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి దుబాయ్‌లోని ఈ వివాహానికి హాజ‌ర‌య్యింది. అప్ప‌ట్లో శ్రీ‌దేవి బాత్‌రూమ్ ట‌బ్‌లో జారిప‌డి చ‌నిపోయింద‌ని పోలీసులు నిర్ధార‌ణ‌లో తేలింది. శ్రీ‌దేవి మ‌ర‌ణానికి భ‌ర్త బోణిక‌పూరే కార‌ణ‌మ‌ని అప్ప‌ట్లో మీడియా వ‌ర్గాలు కూడా కోడై కూసాయి. కానీ, ఇన్నీ సంవ‌త్స‌రాలుగా ఆ విష‌యం గుర్తించి ప్రస్తావించ‌ని బోనిక‌పూర్ తాజాగా ఓ నేష‌న‌ల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీదేవి మ‌ర‌ణం మిస్ట‌రీలోని సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు.

Her death was not a natural one.. Sridevis husband revealed many things..

క‌ఠిన‌మైన డైట్‌.. ప్రాణాల‌ను తీసింద : శ్రీ‌దేవిది స‌హ‌జ మ‌ర‌ణం కాదు. ఆమె ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌రణించింది. సినిమాల్లో అందంగా క‌నిపించ‌డం కోసం శ్రీ‌దేవి క‌ఠిన‌మైన డైట్‌ను ఫాలో అయ్యేది. నాకు ఈ విష‌యం మా పెళ్లి త‌ర్వాతే తెలిసింది. క‌ఠిన‌మైన డైట్‌లో భాగంగా ఉప్పు లేకుండా బోజ‌నం చేసేది. దాంతో చాలాసార్లు నీర‌సించి కింద‌ప‌డిపోవ‌డం కూడా జ‌రిగింది. ఆమెకు లో బిపి ఉంద‌ని, జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని, డాక్ట‌ర్స్ ఎంత వాదించినా ఆమె అస్స‌లు ప‌ట్టించుకోలేదు. ఈ విష‌యాల‌ను నేను శ్రీ‌దేవి మ‌ర‌ణం స‌మ‌యంలో చెప్ప‌లేక‌పోయాను. ఎందుకంటే నాకు అన్నివైపులా నుంచి ఒత్తిడి ఉండేది. దుబాయ్ పోలీసులు న‌న్ను ఓ రోజంతా విచారించారు. లై డిటెక్ట‌ర్ టెస్ట్ చేశారు. భార‌త మీడియా నుంచి వ‌స్తున్న ఒత్తిడి కార‌ణంగా న‌న్ను విచారిస్తున్న‌ట్లు తెలిపారని బోనీ క‌పూర్ లో ఇంట‌ర్య్వూలో ప్ర‌స్తావించారు. శ్రీ‌దేవి చ‌నిపోయిన త‌ర్వాత న‌టుడు నాగార్జున న‌న్ను క‌లిసారు. డైట్ కార‌ణంగా సెట్‌లో ఓసారి శ్రీ‌దేవి ప‌డిపోయిన‌ట్లు నాతో చెప్పారు అని.. అప్ప‌టి సంగ‌తుల‌ను ఓసారి గుర్తుచేసుకున్నారు బోని క‌పూర్‌.

చివ‌రి చిత్రం..మామ్‌ : శ్రీ‌దేవి న‌టించిన చివ‌రి చిత్రం మామ్. ఇందులో ఆమె దేవకీ సబర్వాల్ పాత్రను పోషించింది. ఈ చిత్రంలో ఆమె చేసిన పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకుంది. రవి ఉద్యవార్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 2017లో థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా పలువురు న‌టులు కూడా నటించారు. పెళ్లి, ఫ్యామిలీ కోసం సినిమాల‌కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన శ్రీ‌దేవి రెండో ఇన్నింగ్స్‌ను కూడా మొద‌లుపెట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించారు. ఎన్నో వుమెన్ ఓరియెంటెడ్ సినిమాలు తీసారు. ఇంగ్లీష్ వింగ్లిష్ వంటి చిత్రాలు ఆమెకు మ‌రింత పేరును సంపాదించి పెట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+