బెల్లంకొండ శ్రీనివాస్ సంచలన వరల్డ్ రికార్డ్
మన తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ సినీ చరిత్రలో ఏ హీరో సాధించని ఘనతను సాధించాడు. ఏ ఇండస్ట్రీ హీరోలకు ఇప్పటివరకు ఇది సాధ్యపడలేదు. దీంతో తెలుగోడి సత్తాను బెల్లంకొండ మరోసారి చాటిచెప్పినట్లు అవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తాను హీరోగా నటించిన జయజానకి నాయక చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రంగా వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించిన వివరాలను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ తన సోషల్ మీడియా ఖాతాద్వారా అధికారికంగా ప్రకటించింది.
2014లో పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటికీ ఆయన పది సినిమాలే చేశారు. మంచి దర్శకులు, హీరోయిన్లు, టెక్నీషియన్లతో చేసి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో ఆయన సినిమాలు యావరేజ్, హిట్ గా నిలిచినప్పటికీ వాటిని డబ్బింగ్ చేసి హిందీలో విడుదల చేస్తే మాత్రం కనీవినీ ఎరగనిరీతిలో బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. మనదేశంలో ఇప్పటివరకు ఏ నటుడికి సాధ్యంకాని రీతిలో 100 మిలియన్ల వ్యూస్ కు తగ్గకుండా ఆయన ప్రతి సినిమా వ్యూస్ ను దక్కించుకున్నాయి. దీంతో తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి సినిమాద్వారా ఆయన హిందీలోకి నేరుగా సినిమా చేశారు. దీన్నిబట్టి ఆయనకు అక్కడి ప్రేక్షకుల్లో ఎంతటి ఆదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

2017లో విడుదలైన జయ జానకి నాయకలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. సినిమా యావరేజ్ హిట్ సాధించింది. దీన్ని హిందీలోకి khookhar పేరుతో డబ్బింగ్ చేయగా కొద్దిరోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టించింది. తాజాగా 800 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా కూడా ఇంతటి వ్యూస్ ను దక్కించుకోలేదు. హాలీవుడ్, బాలీవుడ్ హీరోల సినిమాలకు కూడా సాధ్యమవని ఈ ఫీట్‌ను ఓ తెలుగు సినిమా హీరో సాధించడం ఎంతో విశేషమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత 772 మిలియన్ల వ్యూస్‌తో కేజీఎఫ్ పార్ట్1 నిలిచింది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో వచ్చిన సీత సినిమా తెలుగులో డిజాస్టరైంది. కానీ హిందీలో యూట్యూబ్‌లో 642 మిలియన్ల వ్యూస్ సాధించింది.












Click it and Unblock the Notifications