బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హీరో రానా..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలు ప్రముఖులను విచారించింది ఈడీ. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో సినీనటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరయ్యారు.
రానా ప్రమోట్ చేసిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా తీసుకున్న పారితోషికం.. కమీషన్లు, అలాగే మనీలాండరింగ్ కోణంలో జరిగిన లావాదేవీలపై ఈడీ అధికారులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. యాప్‌ల ప్రచారం ద్వారా అందుకున్న ఆర్ధిక లాభాల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే అకౌంట్ల ట్రాన్సాక్షన్లు, డిజిటల్ ఫుట్‌ప్రింట్లు, ఐటీ రిపోర్టులు తదితర ఆధారాలపై ఈడీ మానిటరింగ్ కొనసాగుతోంది.

ఈ కేసులో ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్ విచారణకు హాజరయ్యారు. ఇక ఈ నెల 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.
అంతకు ముందు విజయ్ మాట్లాడుతూ.. రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ వేరు, బెట్టింగ్ యాప్స్ వేరు అని చెప్పారు. ఏ23, మై 11 సర్కిల్, డ్రీమ్ 11 వంటి రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ ఇండియన్ క్రికెట్ టీమ్, మన ఒలంపిక్స్ టీమ్, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ లకు స్పాన్సర్స్ చేస్తుంటాయన్నారు. తాను ప్రచారం చేసింది ఏ23 గేమింగ్ యాప్ కు అని వెల్లడించారు. అది పూర్తిగా రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్ అని.. ఈడీ అధికారులు అడిగిన కాంట్రాక్ట్, బ్యాంక్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అందించానని చెప్పారు.
మరోవైపు కేంద్రం ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పై నిషేధం విధించినప్పటికీ, ప్రముఖ సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎందుకు ఆ యాప్స్‌కు ప్రచారం చేశారు? అని ప్రధానంగా ఈడీ అధికారులు విచారణ జరుగుతుంది. ఈ కేసు టాలీవుడ్‌తో పాటు పలు ఇతర భాషల సినీ పరిశ్రమలకూ విస్తరించవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కొన్ని డిజిటల్ మార్కెటింగ్ సంస్థలు, యూట్యూబ్ చానెళ్లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల సమాచారం సేకరించారు ఈడీ అధికారులు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications