మహేష్ "గుంటూరు కారం" రెమ్యునరేషన్ ఎంత - ఏది నిజం..!!

గుంటూరు కారం. మహేష్ ఫ్యాన్స్ కు పండుగ వచ్చేసింది. ఈ సినిమా పైన ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఈ మూవీపై మరింత హైప్ పెరిగిపోయింది. ప్రస్తుతం గుంటూరు కారం టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చాయి. ఇక మహేష్ మేనియాతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.

ఈ సినిమాను రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిరాని సమాచారం అతడు (2005) మరియు ఖలేజా (2010) వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి మహేష్ బాబు చేస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్ మరియు బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. గుంటూరులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఫ్యాన్స్ భారీగా హాజరయ్యారు. తొక్కిసలాట జరిగింది. ఏపీ ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ వరకు రూ 50 మేర పెంచుకొనేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Hero Mahesh Babu Remuneration for guntur Karam movie leads to new discussion

భారీ అంచనాలతో సిద్దమైన గుంటూరు కారం కోసం మహేష్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ పైన కొంత కాలంగా అనేక రకాల వార్తలు తెర మీదకు వచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో మహేష్ ఒకరు. కానీ ఈ సినిమా కోసం కేవలం రూ.40-50 కోట్లు వరకు మాత్రమే తీసుకుంటున్నాడట. నిజానికి మహేష్ ఒక్కో సినిమా కోసం రూ. 70 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు గుంటూరు కారం కోసం మాత్రం రూ. 40-50 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం దీనిని నిర్దారిస్తున్నారు. ఈ సినిమాలో గురూజీ మాస్ కంటెంట్‏తో మహేష్ ను సరికొత్తగా చూపిస్తుండటంటో ఫ్యాన్స్ తో పాటుగా అందరిలోనూ మరింత ఆసక్తి కనిపిస్తోంది.

మహేశ్ బాబు ఇంతవరకూ వేయని నాటు స్టెప్పులు ఈ సినిమాలో కనిపిస్తాయి. దాంతో ఆడియన్స్ ఈ కొత్తదనానికి బాగా కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలోని పొలిటికల్ ఫైట్ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఇంతవరకూ వచ్చిన పాటలన్నీ మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా 'కుర్చీ మడతపెట్టి' ఎక్కడ చూసినా వినిపిస్తోంది. శ్రీలీల - మీనాక్షి చౌదరి కథానాయికలు మహేష్ కు జోడీగా నటించటంతో మరో ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు సంక్రాంతికి ఈ సినిమా ఏ రేంజ్ లో హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+