సినిమా ఫ్లాప్ అయ్యిందని హీరో షాకింగ్ నిర్ణయం.. శభాష్ అంటూ ప్రశంసలు !
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సైడ్ క్యారెక్టర్ లతో సినిమా కెరీర్ ప్రారంభించిన సిద్దు.. హీరోగా మారి తనదైన శైలిలో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 'డీజే టిల్లు' మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని డీజే టిల్లు 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస విజయాల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం జాక్.
యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఎస్వీసీసీ బ్యానర్ మీద బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. కాగా ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదలై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
స్టోరీ బాగానే ఉన్నా స్క్రీన్ పై తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారని టాక్ వినిపించింది. ఫలితంగా బయ్యర్లు భారీ నష్టాన్ని చవిచూశారని.. నిర్మాత కూడా పెట్టిన డబ్బు తిరిగి రాక డీలాపడ్డారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. నైజాం ఏరియా థియేటర్ రైట్స్ విషయంలో సిద్దు స్వయంగా వ్యవహరించడంతో అక్కడి లాస్ గురించి స్పష్టంగా తెలుసుకున్నాడని అంటున్నారు.

ఈ పరిస్థితిని గమనించిన సిద్ధు, తన రెమ్యూనరేషన్‌లో ఓ భాగాన్ని వెనక్కి ఇచ్చేందుకు ముందుకొచ్చాడని సమాచారం. దాదాపు రూ.4 కోట్లు తిరిగి ఇవ్వడానికి సిద్ధమయ్యాడని.. ఆ మొత్తాన్ని నిర్మాతకు తిరిగి చెల్లించనున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే గతంలో సైతం పలు సినిమాల విషయంలో తమను నష్టాల నుంచి ఆదుకోవాలని బయ్యర్లు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. కానీ సిద్ధు మాత్రం ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు అక్టోబర్‌లో సిద్ధు నటించిన మరో కొత్త సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. "తెలుసు కదా" అనే టైటిల్ తో రాబోతున్న ఆ మూవీని కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్దు సరసన శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications