పెళ్లికి ముందే ఆ హీరోయిన్‌తో ఎఫైర్‌లో ఉన్న శ్రీకాంత్ …?వరుస సినిమాల్లో అవకాశాలు ఇచ్చి మరి..
హీరో శ్రీకాంత్ తెలియని సినీ అభిమాని ఉండరు. 1990లలో శ్రీకాంత్ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలుగా వెలుగుతున్న సమయంలోనే శ్రీకాంత్ హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా లవ్, కుటుంబ కథల్లో నటించి ఫ్యామిలీ అభిమానులకు దగ్గరైయ్యాడు. కెరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినప్పటికీ తరువాత హీరోగా మారి మెప్పించాడు. ముఖ్యంగా 'తాజ్ మహల్' సినిమా శ్రీకాంత్‌ను హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా తరువాత ఆయన వెనుతిరిగి చూడాల్సిన పరిస్థితి లేకుండా పోయింది.
ఇక తన సినిమాలో నటించిన హీరోయిన్‌నే శ్రీకాంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 'ఆమె' సినిమాలో శ్రీకాంత్‌కు జోడిగా నటించిన ఊహను 1997లో సినీ ప్రముఖుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి సమయంలోనే శ్రీకాంత్‌కు ఓ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు సంఘవి. శ్రీకాంత్‌ని హీరోగా నిలబెట్టిన తాజ్ మహల్ సినిమాలో ఆయనకు మరదలుగా సంఘవి నటించింది. ఈ తరువాత కూడా శ్రీకాంత్-సంఘవి కాంబినేషన్‌లో వరుస సినిమాలు వచ్చాయి.

పిల్ల నచ్చింది, మాణిక్యం, ప్రేయసి రావే వంటి సినిమాలు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చాయి. దాంతో అప్పట్లోనే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే పుకార్లు పుట్టుకొచ్చాయి. శ్రీకాంత్-సంఘవి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు వైరల్ అవుతున్న తరుణంలోనే హీరోయిన్ ఊహతో శ్రీకాంత్ పెళ్లిని ఎనౌన్స్ చేయడంతో..ఈ ప్రచారానికి తెరపడినట్టుయింది. ఆ తరువాత హీరోయిన్‌తో రాశీతో శ్రీకాంత్ వరుస సినిమాలు చేసిన సమయంలో కూడా ఇలాంటి రుమార్స్ తెర మీదకు వచ్చాయి. అయినప్పటికీ దీనిపై ఎప్పుడు కూడా శ్రీకాంత్ స్పందించింది లేదు.ప్రస్తుతం శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తుండగా, ఆయన కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.












Click it and Unblock the Notifications