చాలా ఆనందంగా ఉంది.. విడాకులపై తేల్చేసిన తెలుగు హీరోయిన్

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఏ సెలబ్రిటీలు విడాకలు గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం , ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా విడాకుల తీసుకుంటున్న వారి లిస్ట్‌లో ఓ హీరోయిన్ పేరు తెగ వైరల్ అవుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..సంగీత.

సంగీత సినీ ప్రస్థానం మలయాళ చిత్రంతో మొదలై, ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొనసాగింది. ఆమె అసలు పేరు రసిక. 2002లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఆ సినిమాలో ఆమె పాత్రకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. తమిళంలో, విక్రమ్ సరసన నటించిన శివపుత్రుడు (పిథామగన్) ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

Heroine gives clarity on divorce

తెలుగులో 'పెళ్ళాం ఊరెళితే', 'సంక్రాంతి',ఖుషి ఖుషిగా ,శ్రీమతి కళ్యాణం,ఏక్ నిరంజన్ ,ఆచార్య,మసూద ,సరిలేరు నీకెవ్వరు,తెలంగాణ దేవుడు, తోలు బొమ్మలాట వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవల, ఆమె సరిలేరు నీకెవ్వరు మరియు ఆచార్య వంటి చిత్రాలలో సహాయక పాత్రలలో నటించి, తన నటనా ప్రతిభను కొనసాగిస్తున్నారు. ఆమె నటనకు రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ కూడా అందుకున్నారు.

సంగీత 2009లో ప్రముఖ తమిళ గాయకుడు క్రిష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో జరిగింది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఇటీవల, సోషల్ మీడియాలో వారి విడాకుల గురించి పుకార్లు వచ్చాయి. అయితే, ఆమె ఆ పుకార్లను ఖండిస్తూ, తాము సంతోషంగా ఉన్నామని స్పష్టం చేశారు. వారి వివాహ జీవితం గురించి ఆమె మాట్లాడుతూ, మొదట్లో ఇద్దరి అభిప్రాయాలు కలవక సమస్యలు వచ్చాయని, కానీ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని, వాటిని అధిగమించామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+