బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌ని చెప్పుతో కొట్టిన హీరోయిన్.. వీడియో వైరల్ !
బాలీవుడ్‌లో ఓ బడా నిర్మాత, దర్శకుడుని.. ఓ నటి చెప్పుతో కొట్టింది. ఈ అనూహ్య ఘటన బీ టౌన్ లో తీవ్ర చర్చకు తెరలేపింది. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు ? నటి ఎవరు? ఎందుకు ఇలా చేసింది అనే వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..
బాలీవుడ్‌లో నటి రుచి గుజ్జర్ హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. కానీ తెలుగు వారికి పెద్దగా తెలియదు. పలు ప్రైవేట్ ఆల్బమ్స్, పాటలతో మెప్పించిన ఆమె మోడల్ గా కెరీర్ ప్రారంభించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2023లో మిస్ హర్యానా కిరీటాన్ని కూడా గెలుచుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన మాన్ సింగ్ తెరకెక్కించి, నిర్మించిన 'సో లాంగ్ వ్యాలీ' అనే హిందీ చిత్రం జూలై 25న విడుదలైంది. ఈ మూవీలో కూడా ఆమె నటించింది.

అయితే ముంబైలోని సినీ పోలీస్ థియేటర్ నుంచి బయటకొస్తున్న మాన్ సింగ్‌పై నటి రుచి గుజ్జర్ తన చెప్పుతో దాడి చేసింది. 'సో లాంగ్ వ్యాలీ' సినిమాతో పాటు కొన్ని మ్యూజిక్ ఆల్బమ్‌లకు సంబంధించిన రెమ్యూనరేషన్‌ను ఇప్పటికీ చెల్లించపోవడమే అందుకు కారణం అని వాపోయింది. దాదాపు రూ. 25 లక్షల వరకు ఇవ్వాలని.. ఎన్నోసార్లు అడిగినా స్పందించకపోవడంతో ఇలా చేసినట్టు తెలుస్తోంది.
అంతటితో ఆగకుండా.. కొందరు వ్యక్తులతో కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసింది గుజ్జర్. ఆ ప్లకార్డులపై నిర్మాతలు గాడిదల మీద కూర్చున్నట్లుగా ఉన్న చిత్రాలు ఉండటం మరింత వివాదంగా మారింది. ఈ దాడిని సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన కరణ్ అడ్డుకునేందుకు యత్నించారు.
ఈ ఘటనపై రుచి గుజ్జర్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాన్ సింగ్ తనకు రావాల్సిన రూ. 25 లక్షల రెమ్యూనరేషన్ చెల్లించడం లేదని, ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన పలు రకాలుగా స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications