బాలయ్యను అవమానించిన నిహారిక?

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, మెగా బ్యూటీ అయిన కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. సినీ పరిశ్రమకు పరిచయమైనప్పటికీ ఊహించినంతగా విజయం దక్కకపోవడంతో సినిమాలను వదిలేసి నిర్మాతగా చిత్రాలను నిర్మిస్తోంది. చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టినప్పటికీ చిన్న చిన్న మనస్పర్థలకే విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతానికి ఒంటరిగానే జీవిస్తోన్న నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లు తీయడంతోపాటు సినిమాలు నిర్మించడంలో బిజీగా ఉంది.

స్నాక్స్ కోసం ఎగబడేదాన్ని
కమిటీ కుర్రోళ్లు సినిమా నిర్మించింది. దీని టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా నిహారిక పాల్గొని సందడి చేసింది. గ్రామసీమల్లో కుర్రాళ్ల ఆటలు, పాటలు, సరదా సన్నివేశాలు, కుర్రాళ్ల ప్రవర్తన, కొట్లాటల్లాంటి సన్నివేశాలన్నీ ఇందులో చూపిస్తున్నారు. ఈ సినిమాలో మళ్లీ ఎప్పటికీ తిరిగిరావు అనిపించే సంఘటనలు ఏమైనా ఉన్నాయా అని విలేకరులు ప్రశ్నించారు. చిన్నప్పుడు ఫిలిం చాంబర్ లో బ్రేక్ సమయంలో స్నాక్స్ కోసం ఎగబడేదానన్నని, అటువంటి సందర్భాలు చాలా బాగుంటాయని, అవి తిరిగివస్తే బాగుండు అని అనిపిస్తోందన్నారు.

heroine konidela niharika latest comments on balakrishna and nagarjuna and venkatesh

వాళ్ల సినిమాలు చూసిన తర్వాతే..
తాను చిన్నతనంలో చిరంజీవి పెదనాన్న ఒక్కరే హీరో అనుకునేదాన్నిఅని, ఎక్కువగా పెదనాన్న సినిమాలే చూసేదాన్ని అని చెప్పారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ హీరోలని తనకు అప్పుడు తెలియదని, అసలు వాళ్లు హీరోలుగా సినిమాలు తీస్తారు అనే విషయమే తనకు తెలియదని చెప్పింది. వాళ్ల సినిమాలు చూడకపోవడంవల్లే తనకు ఏమీ తెలియలేదన్నారు. తర్వాత క్రమంగా రామానాయుడు స్టూడియో, ఛాంబర్లలో వాళ్ల సినిమాలు చూడటం ప్రారంభించానన్నారు. అవి చూస్తున్న తర్వాతే తనకు వీళ్లు కూడా హీరోలేనా అని అనుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం నిహారిక చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+