స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి

నటి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ను వివాహం చేసుకోవడంద్వారా త్వరలోనే మెగా ఇంటి కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ ను ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం వైభవంగా జరిగింది. జూన్ 9వ తేదీన లగ్నాలు పెట్టుకున్న ఈ జంట నవంబర్ ఒకటో తేదీ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరుగుతుందని వరుణ్ తేజ్ వెల్లడించారు.

శరవేగంగా పెళ్లి పనులు
పెళ్లికి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. రామ్ చరణ్-ఉపాసన జంట కూడా ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు. పెళ్లికొడుకు, పెళ్లికూతురు కూడా వెళ్లారు. త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న లావణ్య తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పారు. స్నేహితులకు ఘనంగా బ్యాచిలర్ పార్టీని ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను లావణ్య నిహారిక సోషల్ మీడియాద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరలవుతున్నాయి. ఈ పార్టీ ఇచ్చిన తర్వాత లావణ్య ఇటలీ వెళ్లారు.

heroine Lavanya Tripathi bachelorette Party

ఇటలీలో వివాహం
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఇద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించారు. వివాహాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా నాగబాబు జరిపించనున్నారు. ఇటలీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల కోసం ప్రత్యేకంగా పార్టీని ఇవ్వనున్నారు. వరుణ్ తేజ్ తాజాగా నటించి గాండీవధారి అర్జున చిత్రం పరాజయం పొందింది. దీంతో తర్వాత చేసే సినిమాను జాగ్రత్తగా చేయాలని నిర్ణయించారు. వీటీ 13 పేరుతో ఇది తెరకెక్కుతోంది. వరుణ్ తేజ్ సోదరి నీహారికి కూడా కొన్ని సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు చేసింది. అవి ప్రేక్షకులను అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో నిర్మాతగా సినీ పరిశ్రమలో స్థిరపడటానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే జొన్నలగడ్డ చైతన్యకు విడాకులిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+