హద్దులు దాటిన అందాల విందు

కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ విజయాలు దక్కలేదు. సాధ్యమైనంత మేరకు గ్లామర్ ట్రీట్ ఇస్తోందికానీ ఈ అమ్మడికి అవేమీ కలిసిరావడంలేదు. ఇంతకీ ఎవరంటే ప్రగ్యా జైశ్వాల్. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన ఫొటోలను పోస్ట్ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన తాజా ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. లేటెస్ట్ గా ప్రగ్యా షేర్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి.

సొగసుల తలపులు తెరిచేసింది.. నానా రచ్చ చేసేసింది.. అంతేకాదు బ్లాస్టింగ్ గ్లామర్ షోలతో చూసేవారందరికీ మత్తెక్కించేస్తోంది ప్రగ్యా జైస్వాల్. ఫొటోలు ఊహించని రీతిలో ఉండేసరికి వెంటనే ట్రెండింగ్ లోకి వచ్చాయి. ప్రగ్యా రొమాంటిక్ ఫొటోలు చూసిన నెటిజన్లు కామెంట్లు చేయడమే కాదు చర్చ పెట్టారు. 1991 జనవరి 12న జన్మించిన ప్రగ్యా జైశ్వాల్ సినిమాల్లోకి రావడానికి ముందు వాణిజ్య ప్రకటనలు చేసింది.

heroine pragya jaiswan latest photos

తెలుగు, తమిళంతో తీసిన 'విరాట్టు/ డేగ'సినిమాద్వారా పరిశ్రమలోకి ప్రవేశించింది. అనంతరం 2015లో క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కంచె సినిమాతో నేరుగా తెలుగుకు పరిచయమైంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కథానాయకుడు. తొలి సినిమాతోనే బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డును సాధించింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన 'అఖండ'లో IAS అధికారిణిగా కనిపించింది. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతోపాటు భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ఓం నమో వేంకటేశాయ చిత్రంలో నటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+