ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోతో హింట్ ఇచ్చిన సమంత?

తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవడమే కాదు.. ఆ సినిమాలో హీరోగా నటించి నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఇద్దరూ ఏడు సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత వివాహం చేసుకున్నారు. కారణాలు తెలియరాలేదుకానీ హఠాత్తుగా మూడు సంవత్సరాల తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగానే ఉంటోంది. మధ్యలో మయోసైటిస్ వ్యాధి సోకడంతో ఏడాదిన్నరపాటు సినిమాలకు విరామం ప్రకటించింది.

పికెల్ బాల్ టీం కొనుగోలు చేసింది
తిరిగి సినిమాలు, వెబ్ సిరీస్ ల పరంగా బిజీ అవుతోంది. మరోవైపు నాగచైతన్య తాను ప్రేమిస్తున్న శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం జరుపుకున్నారు. వచ్చే ఏడాది మార్చిలో వీరి వివాహం ఇండియాలో లేదంటే పారిస్ లో జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగచైతన్య నిశ్చితార్థం విషయంపై సమంత ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కొన్నిరోజులు సైలెంట్ అయింది. ఇటీవలే వరల్డ్ పికెల్ బాల్ చెన్నై టీంను కొనుగోలు చేసింది. ముంబయిలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో పాల్గొంది.

heroine samantha share latest photo in instagram

హింట్ ఇవ్వడానికి ఈ ఫొటో షేర్ చేసింది
తెలుగుతోపాటు తమిళంలో కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. మరో వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకుంది. బాలీవుడ్ లో షారుక్ ఖాన్ సరసన అవకాశం వచ్చిందంటున్నారుకానీ దీనిపై అధికారికంగా వార్త రాలేదు. ఎప్పటికప్పుడు తన వివరాలను, ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. తాజాగా పూల డ్రస్ ధరించిన ఒక ఫొటోను పోస్ట్ చేసింది.

ఈ ఫొటోలో సమంత ఎంతో సంతోషంగా కనపడుతోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఇంత సంతోషంగా సమంతను చూడటం ఎప్పుడూ జరగలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవలే ఓ డైరెక్టర్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే తన సంతోషానికి అది నిజమేనేమోనని అభిమానులు అంటున్నారు. ఇలా అయితే త్వరలోనే మనకు శుభవార్త చెప్పబోతున్నానంటూ సమంత హింట్ ఇవ్వడానికే ఈ ఫొటో షేర్ చేసిందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+