గుడ్‌న్యూస్.. సమంత కొత్త ప్రయాణం!
మూడు సంవత్సరాలుగా ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ దేశంలో నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతోంది సమంత. మయోసైటిస్ కు చికిత్స తీసుకున్న తర్వాత, ముందు కూడా వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తోంది. తాజాగా రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ లో నటిస్తోంది. గతంలో నిర్మాతగా మా ఇంటి బంగారం పేరుతో సినిమాను ప్రారంభించింది. ప్రియదర్శి హీరో. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏదీ సమంత నుంచి రాలేదు. కాకపోతే నిర్మాతగా మారి శుభం అనే పేరుతో కామెడీ, హారర్ సినిమాను తీస్తోంది. దీంతో తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లైంది.
కొత్తవారు వచ్చేయడంతో..
తాజాగా సమంత కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. నటిగా, నిర్మాతగా నిరూపించుకున్న సమంత ఇప్పుడు దర్శకురాలు కాబోతోంది. ఓ చక్కటి ప్రేమ కథకు సంబంధించిన కథను సిద్ధం చేసుకుంది. స్క్రిప్ట్ కూడా పూర్తయింది. దీనికి స్వయంగా ఆమే దర్శకత్వం వహించాలనుకుంటున్నారు. దాదాపుగా సినిమాలు చేయడం మానేసినట్లే అంటున్నారు. మయోసైటిస్ చికిత్స కోసం ఏడాది గ్యాప్ తీసుకోవడంతో అది కాస్తా మూడు సంవత్సరాలకు పెరిగింది. ఈలోగా చాలామంది కొత్త హీరోయిన్లు రావడంతో సమంతకు అవకాశాలు రావడంలేదు.

ఎంతవరకు రాణిస్తుందో చూడాలి
ఈ సినిమాను తన సొంత బ్యానర్ ట్రూలాలలోనే నిర్మించబోతోంది. ప్రస్తుతం కొత్త కొత్త ఆర్టిస్టులతో చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. కొత్తవారితోపాటు పాతవారిని కూడా నటింపచేయాలనుకుంటోంది. నటన, నిర్మాణం, దర్శకత్వం.. ఈ మూడు విభాగాల్లో రాణించాలని సమంత బలంగా భావిస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్', 'హనీ బన్నీ' ద్వారా అంతర్జాతీయంగా తన ఖ్యాతిని పెంచుకుంది. ఇప్పుడు మరో కొత్త కోణంలో కనిపించబోతోంది. దర్శకత్వంలో సమంత ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications