మతి పోగొడుతున్న మిల్క్ బ్యూటీ అందాలు
స్టార్ హీరోయిన్ తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పరిశ్రమకు వచ్చి దాదాపు 18 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. 75కి పైగా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. తన కెరీర్ లోనే మొదటిసారిగా తెలుగులో హీరోయిన్ గా నటించింది. తర్వాత తమిళం, కన్నడం, హిందీ సినిమాల్లో కూడా తన సత్తాను చాటింది. తాజాగా మళయాళ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. దాదాపుగా అన్ని పరిశ్రమల్లోని అగ్ర హీరోలందరితో జతకట్టింది.
బాలీవుడ్ లో తెరకెక్కిన లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా లాంటి వెబ్ సిరీస్ లతో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. తమన్నా ఇచ్చిన బోల్డ్ పర్ఫామెన్స్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. వీటిల్లో ఎవరూ ఊహించని రీతిలో రెచ్చిపోయింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్, రజనీకాంత్ జైలర్ సినిమాల్లో కూడా నటించింది. సోషల్ మీడియాల్లో తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు చూసినవారికి మతి పోతోంది.తన ఎద అందాలు హైలైట్ చేస్తూ తీసిన ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి.

1989 డిసెంబరు 21న జన్మించిన తమన్నా తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో నటిస్తోంది. కళైమామణి, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది.

తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 50వ చిత్రంపై కామెంట్ చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించింది. సురా పేరుతో విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయాన్ని పొందింది. ఈ చిత్రం ఆడదు అన్న విషయాన్ని తాను ముందే గ్రహించానని, అయినా అందులో నటించాల్సి వచ్చిందన్నారు. ఈ చిత్రంలో తాను నటించి పెద్ద తప్పు చేశాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications